Inspiring Story: అంధురాలని ఉద్యోగం ఇవ్వలేదు.. ఇప్పుడు తానే నలుగురికి ఉపాధి కల్పిస్తోంది.. లక్షలాది రూపాయలు సంపాదిస్తోంది!

కష్టం వస్తే కుంగిపోవడం.. బెదిరిపోవడం వలన ప్రయోజనం ఉండదు. కష్టాన్ని తట్టుకుని నిలబడే తత్వాన్ని పట్టుకుంటే కచ్చితంగా కష్టాల కడలిని సునాయాసంగా దాటేయోచ్చు.

Inspiring Story: అంధురాలని ఉద్యోగం ఇవ్వలేదు.. ఇప్పుడు తానే నలుగురికి ఉపాధి కల్పిస్తోంది.. లక్షలాది రూపాయలు సంపాదిస్తోంది!
Inspiring Story Gita
Follow us
KVD Varma

| Edited By: Team Veegam

Updated on: Nov 16, 2021 | 6:37 PM

Inspiring Story:  కష్టం వస్తే కుంగిపోవడం.. బెదిరిపోవడం వలన ప్రయోజనం ఉండదు. కష్టాన్ని తట్టుకుని నిలబడే తత్వాన్ని పట్టుకుంటే కచ్చితంగా కష్టాల కడలిని సునాయాసంగా దాటేయోచ్చు. చాలామంది పనిచేసే సత్తా.. చదువు.. మంచి కుటుంబం ఇవన్నీ ఉండి కూడా చిన్న చిన్న ఇబ్బందులకు తమ జీవితాల్ని పాడుచేసుకుంటారు. అదేపనిగా తాము చాలా కష్టాల్లో ఉన్నామని.. ఇంకా చెప్పాలంటే.. తాము మాత్రమే కష్టాల్లో ఉన్నామని భావిస్తూ చేయవలసిన పనిని కూడా పక్కన పెట్టి దుఃఖ సాగరంలో మునిగిపోతారు. అటువంటి వారికి ఈ అమ్మాయి కథనం ఒక కనువిప్పు కావచ్చు. ఎందుకంటే, చిన్న వయసులోనే రెండు కళ్ళూ కోల్పోయి.. బతుకు చీకటి అయిపోయి.. సహాయం చేసేవారు లేక.. ఇబ్బందులు కాదు కాదు.. దారుణ కష్టాన్ని అనుభవించి.. ఇప్పుడు స్వశక్తితో తాను నిలదొక్కుకోవడమే కాకుండా మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఆమె కథ కచ్చితంగా చిన్న కష్టానికి అదిరిపోయేవారికి స్ఫూర్తి ఇస్తుంది.

కేరళలోని త్రిసూర్‌కు చెందిన గీతా సలీష్‌కు కంటి చూపు లేదు. చిన్న వయసులోనే రెండు కంటి చూపును కోల్పోయింది. అకస్మాత్తుగా ఆమె జీవితంలో చీకటి అలుముకుంది. కానీ, ఆమె కుంగిపోలేదు. పట్టుదలతో జీవితాన్ని ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రతిభ దేశమంతటా పరిమళాన్ని వెదజల్లుతోంది. గత ఏడాది కోవిడ్ సమయంలో, గీత ఆన్‌లైన్ ఫుడ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె ఊరగాయలు, చట్నీలు, నెయ్యి వంటి ఉత్పత్తులను ఇంటి దగ్గర తయారు చేస్తుంది. వాటిని మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. దీనిద్వారా ఆమె నెలకు 15 లక్షలు సంపాదిస్తోంది.

చదువంటే ఆమెకు చిన్నతనంలో ప్రాణం. ఎనిమిదో తరగతి వరకూ స్కూలు ఫస్ట్. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి వెళ్ళిపోతానని చిన్నతనంలోనే చెప్పేది. ఇప్పుడు ఆమె వయసు 36. ఆమె చెప్పినట్టే పెద్ద స్థాయి సంపాదన లభిస్తోంది. కానీ, చదువు వల్ల కాదు. ఎందుకంటే ఎనిమిదో తరగతి చదువుతుండగా ఆమె కంటి చూపు పోయింది. ఆమె కంటికి సంబంధించిన ఆప్టిక్ నరాల ఇబ్బంది ఎదుర్కుంది. ఎంతమంది వైద్యులను కలిసినా ఫలితం దొరకలేదు. ఆమె జీవితం వెలుగు నుంచి చీకట్లోకి జారిపోయింది.

ఒకే దెబ్బతో కలలన్నీ కూలిపోయాయి..

ఇది అంతా హఠాత్తుగా జరిగిపోయిందని ఇప్పుడు గీత చెబుతోంది. ”అకస్మాత్తుగా నా చూపు పోయింది. కలలన్నీ ముగిశాయి. చాలా నెలలుగా చాలా బాధపడ్డాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.” అని అప్పుడు ఆమెకు అకస్మాత్తుగా వచ్చిన కష్టాన్ని వివరించింది. ఇక కంటికి నయం కాదనే వాస్తవం అర్ధం కాగానే.. ఆమె దానిని పాజిటివ్ గా తీసుకుంది. తన చదువు కోవాలనే ఆశను చంపెసుకోకుండా నిలుపుకోవాలని భావించింది. ఆమె అంధ పిల్లలతో కలిసి చదవడం.. వారి నుంచి ఎవరి పైనా ఆధారపడకుండా ఎలా నిత్య కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి అనే అంశాల్ని నేర్చుకుంది. మొదట 10, తరువాత 12, ఆపై గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈలోగా ఆమెకు ఫార్మసీ రంగంలో పని చేసే వ్యక్తి తో పెళ్లి అయింది.

రెస్టారెంట్ తో ప్రయత్నాలు..

గీత భర్త ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆమె అంధురాలు అనే విషయాన్ని ఎప్పుడూ తనకు అనిపించేలా చేయలేదు. అన్నివిధాలుగాను ఆమెను ప్రోత్సహించారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవడం కోసం భర్త సహకారంతో 8 ఏళ్ల క్రితం ఒక రెస్టారెంట్ ప్రారంభించింది. దానికోసం అవసరమైన వంటకాలు ఎలా చేయాలో నేర్చుకుంది. తరువాతే రెస్టారెంట్ ప్రారంభించింది. మొదట్లో అంతా బాగానే జరిగింది. రెస్టారెంట్ ద్వారా మంచి ఆదాయం వచ్చింది. అయితే, కొద్ది కాలం తరువాత ఇబ్బందులు మొదలయ్యాయి. క్రమేపీ రెస్టారెంట్ ఆదాయం తగ్గిపోయింది. కస్టమర్లు తగ్గారు. దీంతో ఆమె రెస్టారెంట్ మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రెస్టారెంట్ వ్యాపారం మూతపడడంతో ఎక్కడో ఉద్యోగం చేయాలని గీత నిర్ణయించుకుంది. ” పొలిటికల్ సైన్స్ చదివాను కాబట్టి ఎక్కడైనా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. ప్రతిచోటా ప్రయత్నించాను. కానీ. అంధత్వం కారణంగా నాకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతిచోటా అందరూ తిరస్కరించేవారు.” అని గీత చెప్పింది. ఈ సమయంలో ఆమె చాలా బాధపడింది. ఆమె మానసికంగా కుంగిపోవడం ప్రారంభించింది. ఆమెకు నేను ధైర్యం చెప్పాను. మళ్ళీ ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాము.. మన ఉద్యోగం మనమే సంపాదించుకుందాము అని గీతను ప్రోత్సహించాను అని ఆమె భర్త చెప్పారు.

దీంతో ఆమె మళ్ళీ చిన్నగా వ్యాపారం మొదలు పెట్టింది. ఇంటి వద్ద కోడి గుడ్లను అమ్మడం ప్రారంభించింది. మెల్లగా కోళ్ళను పెంచడం ప్రారంభించింది. వాటి నుంచి వచ్చిన గుడ్లను స్థానిక మార్కెట్లో విక్రయించేవారు. మెల్లగా వ్యాపారం పుంజుకుంది. అంతా బావుంది అనుకుంటే ఎదో ఒక దెబ్బ కొట్టడమే విధి పని. అయితే, ఈసారి గీతకే కాదు మొత్తం ప్రపంచాన్నే విధి కరోనా రూపంలో ఆడేసుకుంది. ప్రపంచం స్తంభించి పోయింది. గీత వ్యాపారమూ ఆగిపోయింది. ఆమె వ్యాపారం ఆగిపోవడమే కాకుండా ఆమె భర్త ఉద్యోగమూ పోయింది. దీంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

ఇటువంటి సమయంలో ఏమి చేయాలో వారికీ పాలుపోలేదు. చివరికి ఒక ఆలోచన వచ్చింది. కొన్ని ఆహార పదార్ధాలను ఇంటిలోనే తయారు చేసి ఆన్లైన్ లో విక్రయిస్తే బావుంటుంది అనిపించింది. వెంటనే దానిని మొదలు పెట్టారు. ఇంట్లోనే పచ్చళ్ళు.. చట్నీలు చేయడం మొదలు పెట్టారు. తమ దగ్గర దొరికే ఆహార పదార్ధాలతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలు పెట్టారు. మెల్లగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. కోవిడ్ సమయంలో ఖర్జూరం, నెయ్యితో చేసిన కషాయం చేసి ఆన్లైన్ లో అమ్మకం చేశారు. కరోనా ప్రభావంతో దీనికి మంచి డిమాండ్ వచ్చింది. అంతే.. ఏ కరోనా వలన వ్యాపారం దెబ్బ తిందో అదే కరోనా కారణంగా తిరిగి ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది.

ఇంటితో మొదలై దేశవ్యాప్తంగా..

సోషల్ మీడియాలో ప్రజలకు మంచి స్పందన వచ్చిన తరువాత వారు తమ స్వంత వెబ్‌సైట్‌ను కూడా తయారు చేసుకున్నారు. దీంతో వ్యాపారం చాలా వృద్ధి చెందింది. దేశం నలుమూలల నుండి ఆర్డర్లు రావడం ప్రారంభించాయి. ప్రస్తుతం, గీతా దాదాపు 10 రకాల హోమ్ మేడ్ ఉత్పత్తులను మార్కెట్ చేస్తోంది. తనతో పాటు నలుగురు మహిళలను సహాయంగా నియమించుకున్నారు.

ఈ వ్యాపారంలో అన్నీ తానే నిర్వహిస్తుంది. ఆమె స్వయంగా స్మార్ట్‌ఫోన్ నుండి ఆర్డర్‌లను తీసుకుంటుంది. మార్కెటింగ్‌ను కూడా స్వయంగా నిర్వహిస్తుంది. సాఫ్ట్‌వేర్ సహాయంతో కస్టమర్ల మెసేజ్‌లను కూడా చదవవచ్చని, వారితో చాట్ చేయవచ్చని ఆమె భర్త చెప్పారు. ఇది మాత్రమే కాదు, ఆమె స్వయంగా ముడి సరుకు కోసం మార్కెట్‌కు వెళుతుంది. ఆన్‌లైన్‌తో పాటు, ఆమె త్రిసూర్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రిటైల్ మార్కెటింగ్ కూడా చేస్తుంది.

ఇది గీత కథ.. గీతలాంటి వారు ఎందరో ఉన్నారు. తమ వైకల్యం చూసి కుంగిపోకుండా పట్టుదలతో ప్రపంచాన్ని జయిస్తున్నారు. తాము అనుకున్న శిఖరాన్ని చేరడానికి వచ్చిన అడ్డంకుల్ని ఎదుర్కుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విజయాల బాటలో పయనించే ప్రయత్నం చేయాలి.

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..