Viral News: ట్యాక్సీలో ఎక్కిన ఆగంతకుడు.. అతడి గురించి తెలియగానే డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే షాకే.!
ఒక టాక్సీ డ్రైవర్ సాహసం, సమయస్పూర్తి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. తన క్యాబ్‌లో ఎక్కింది ఒక సూసైడ్ బాంబర్ అని తెలిసీ..

ఒక టాక్సీ డ్రైవర్ సాహసం, సమయస్పూర్తి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. తన క్యాబ్‌లో ఎక్కింది ఒక సూసైడ్ బాంబర్ అని తెలిసీ ఎంతో ధైర్యంతో.. చాకచక్యంతో అతడిని బంధించి పెను ప్రమాదం నుండి ప్రజలను కాపాడాడు. లేదంటే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. టాక్సీ డ్రైవర్ సాహసాన్ని మెచ్చుకుంటూ ప్రజలు నిజమైన హీరో అంటూ ప్రశంసలుకురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే లండన్‌లోని లివర్‌పూర్‌లో రిమెంబరెన్స్‌డే సర్వీస్ సందర్భంగా నగరంలోని మెటర్నటీ ఆస్పత్రి వద్ద కారు పేలుడు జరిగి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు ఏం జరిగిందంటే.. ఓ సూసైడ్ బాంబర్ లివర్‌పూల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ వద్దకు చేరుకుని.. తనను తాను పేల్చుకుని మారణహోమం సృష్టించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో తన శరీరం మీద పేలుడు పదార్థాలను అమర్చుకుని లివర్‌పూల్‌కు వెల్లడానికి క్యాబ్ ఎక్కాడు.
అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో.. క్యాబ్‌ను లివర్‌పూల్ మెటర్నటీ ఆస్పత్రి వద్దకు డైవర్ట్ చేశాడు టాక్సీ డ్రైవర్. ఆస్పత్రి వద్దకు వెళ్తుండగా.. తన కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టాక్సీ డ్రైవర్ అతడిని ఓ కంట కనిపెడుతూ వచ్చాడు. తన కారులో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ అని అతనికి అర్థమయ్యింది. మెటర్నటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే టాక్సీ డ్రైవర్ వెంటనే కిందకు దిగి బాంబర్‌ని క్యాబ్‌లోనే లాక్ చేశాడు. దాంతో బాంబర్ కారులో ఉండే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో బాంబర్ మృతి చెందాడు. డ్రైవర్‌కు గాయాలుకావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. టాక్సీ డ్రైవర్ చూపిన సాహసం తెలుసుకున్న ప్రజలు అతడిని నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
