AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness Record: పుట్టిన ఏడాదికే గిన్నిస్‌ బుక్‌లో రికార్డు.. ఇంతకీ ఈ బుడ్డోడు ఏం చేశాడనేగా..

Guinness Record: గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకోవాలంటే ఏదైనా అద్భుతం చేయాలి, ఎవరూ చేయని పనిని చేస్తే ఇలాంటి అరుదైన గుర్తింపు లభిస్తుంది. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన ఓ బుడ్డోడు మాత్రం...

Guinness Record: పుట్టిన ఏడాదికే గిన్నిస్‌ బుక్‌లో రికార్డు.. ఇంతకీ ఈ బుడ్డోడు ఏం చేశాడనేగా..
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 16, 2021 | 2:26 PM

Share

Guinness Record: గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకోవాలంటే ఏదైనా అద్భుతం చేయాలి, ఎవరూ చేయని పనిని చేస్తే ఇలాంటి అరుదైన గుర్తింపు లభిస్తుంది. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన ఏడాదికే గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏడాది వయసులో గిన్నిస్‌ బుక్‌లో చోటు ఎలా సంపాదించుకున్నాడు.? అసలు ఆ కుర్రాడు చేసిన పని ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మిచెల్‌ బట్లర్‌ అనే మహిళకు జులై 5,2020లో జర్మింగ్ హామ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌లో కవలలు జన్మించారు. అయితే నెలలు నిండకముందే ఆ చిన్నారులు డెలివరీ అయ్యారు. ఇద్దరిలో ఆడ శిశువు పుట్టిన తర్వాత మరణించిగా.. మగ శిశువు మాత్రం బతికాడు. శరీరం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం కవల సోదరి ఒక రోజు తర్వాత మరణించింది. ఇక ఆ రెండో కుర్రాడు మాత్రం మరణాన్ని జయించాడు. ఇప్పుడు ఆ కుర్రాడికి ఏడాది వయసు, కర్టిస్‌ అని పేరు పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ బుడ్డోడు.. ప్రపంచంలోనే బతుకున్న ‘మోస్ట్ ప్రిమెచ్యూర్ బేబీ’ టైటిల్‌తో గిన్నిస్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు.

ఇదిలా ఉంటే ఈ కుర్రాడు నాలుగు నెలల ముందే తల్లి కడుపు నుంచి బయటకొచ్చాడు. 40 వారాలు తల్లి కడుపులో ఉండాల్సి ఉండగా.. కేవలం 21 వారాల 1 రోజుకే జన్మించాడు. కర్టిస్‌ జన్మించిన సమయంలో అతని బరువు కేవలం 14.8 బౌన్సులు.. కిలోల్లో చెప్పాలంటే 500 గ్రాముల కంటే తక్కువ. దీంతో కర్టిస్‌ జన్మించిన తర్వాత మూడు నెలలపాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇలా ఎన్నో కష్టాల తర్వాత ఈ బుడ్డోడు తన ఫస్ట్‌ బర్త్‌డేను పూర్తి చేసుకున్నాడు.

Also Read: Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా స్వలింగ సంపర్కుడు.. సిఫార్సు చేసిన కొలీజియం..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Follow Us
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఉడుము గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. రాత్రికి రాత్రే కనిపించకుండా..
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
మనుషులుగా మారే పాములు ఉన్నాయా?..స్నేక్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారంటే
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...