Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా స్వలింగ సంపర్కుడు.. సిఫార్సు చేసిన కొలీజియం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్‌ న్యాయవాది, గే అయిన సౌరభ్‌ కృపాల్‌ను

Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా స్వలింగ సంపర్కుడు.. సిఫార్సు చేసిన కొలీజియం..
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2021 | 6:50 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్‌ న్యాయవాది, గే అయిన సౌరభ్‌ కృపాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కొలీజియం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్‌ రికార్డులకెక్కనున్నారు. ఈనెల11న జరిగిన సమావేశంలో సౌరభ్‌కు పదోన్నతి కల్పించే సిఫార్సును జస్టిస్‌ రమణ, జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ ఖాన్విల్కర్‌ల బృందంతో కూడిన కొలీజియం ఆమోదించింది. మాజీ సీజేఐ భూపీందర్‌నాథ్‌ కృపాల్‌ కుమారుడైన సౌరభ్‌ కృపాల్‌ పేరును న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017లోనేసిఫార్సు చేసింది. అయితే అతడి స్వలింగ సంపర్క నేపథ్యంలో 2018, 2019లో మూడుసార్లు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైనప్పటికీ దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది.

అందుకే సందిగ్ధం.. కాగా ఇదే విషయంపై ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. స్విస్‌ విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తితో సౌరభ్‌ సహజీవనం చేస్తుండడంతో ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతోంది. అదేవిధంగా కృపాల్‌ జాతీయతతో పాటు అతడి భాగస్వామి యూరోపియన్‌ అయినందున ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇక సౌరభ్‌ విషయానికొస్తే ఆక్స్‌ ఫర్డ్‌, కేంబ్రిడ్జి లాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో న్యాయ శాస్త్రం చదివారు. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకు పైగా లాయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా గే హక్కుల కోసం సుప్రీంలో పోరాడి విజయం సాధించారు. సౌరభ్‌ తండ్రి భూపీందర్‌నాథ్‌ కృపాల్‌ 2002 మే నుంచి నవంబరు మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

Also Read:

Delhi Pollution: డేంజర్‌ జోన్‌లో ఢిల్లీ ప్రజలు.. పెరుగుతున్న కళ్లు మంటలు, గొంతు నొప్పి కేసులు

PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు..

Annapurna Statue: అన్నపూర్ణ మాతా విగ్రహ చరిత్ర మీకు తెలుసా..108 సంవత్సరాల తర్వాత కెనడా నుంచి ఇండియాకి..