Annapurna Statue: అన్నపూర్ణ మాతా విగ్రహ చరిత్ర మీకు తెలుసా..108 సంవత్సరాల తర్వాత కెనడా నుంచి ఇండియాకి..

Annapurna Statue: సోమవారంతో అన్నపూర్ణ మాతా ప్రయాణం ముగిసింది. కాశీ నుంచి కెనడాకు తీసుకెళ్లిన విగ్రహాన్ని 108 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.

Annapurna Statue: అన్నపూర్ణ మాతా విగ్రహ చరిత్ర మీకు తెలుసా..108 సంవత్సరాల తర్వాత కెనడా నుంచి ఇండియాకి..
Maa Annapurna
Follow us

|

Updated on: Nov 16, 2021 | 5:57 AM

Annapurna Statue: సోమవారంతో అన్నపూర్ణ మాతా ప్రయాణం ముగిసింది. కాశీ నుంచి కెనడాకు తీసుకెళ్లిన విగ్రహాన్ని 108 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈరోజు కాశీ విశ్వనాథ ఆలయంలోఅన్నపూర్ణ మాత విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. నవంబర్ 10న ఢిల్లీ నుంచి శోభా యాత్ర చేపట్టారు. తల్లి విగ్రహాన్ని రోడ్డు మార్గంలో వారణాసికి తీసుకొచ్చారు. యుపిలోని 19 జిల్లాల గుండా ప్రయాణిస్తూ కాశీకి చేరుకుంది. అయితే ఈ విగ్రహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడం వెనుక చాలా పెద్ద కథ ఉంది.

1913లో వారణాసికి మెకెంజీ అనే చరిత్ర కారుడు పర్యాటకుడిగా వచ్చారు. గంగానది ఒడ్డున ఉన్న ఆలయంలో ఈ అన్నపూర్ణ తల్లి విగ్రహాన్ని చూశారు. మెకంజీ ఈ విగ్రహాన్ని ఇష్టపడ్డారు. విగ్రహం కావాలని మెకంజీ తన గైడ్‌ను కోరినట్లు సమాచారం. అప్పుడు గైడ్ తల్లి అన్నపూర్ణ విగ్రహాన్ని దొంగిలించి మెకంజీకి విక్రియంచాడు. అతడు ఈ విగ్రహాన్ని కెనడాకు తీసుకువెళ్లారు 1936లో ఇది మెకెంజీ ఆర్ట్ గ్యాలరీలో చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. 1913లో ఈ విగ్రహం కాశీ నుంచి అదృశ్యమైందని భారత ప్రభుత్వ కృషితో తిరిగి తీసుకురావచ్చని పరిశోధనలో తేలింది.

చునార్ ఇసుకరాయితో చేసిన అన్నపూర్ణాదేవి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇది18వ శతాబ్దానికి చెందినదని విగ్రహ నిపుణులు తెలిపారు. అంటే ఇది దాదాపు మూడు శతాబ్దాల నాటి విగ్రహం. దీని పొడవు 17 సెం.మీ, వెడల్పు 9 సెం.మీ. పురాణాల ప్రకారం.. తల్లి అన్నపూర్ణ దేవి పార్వతి రూపంలో మహాదేవుడిని వివాహం చేసుకుంది. కైలాస పర్వతంపై నివసించడం ప్రారంభించింది. అయితే ఒకప్పుడు భూమి మీద కరువు వచ్చింది. అప్పుడు పార్వతి తల్లి అన్నపూర్ణగా కాశీలో బిచ్చగాడి రూపంలో అవతరించింది. తరువాత మహాదేవుడు తల్లి అన్నపూర్ణను వేడుకున్నాడు ఆమె ఆహార సంక్షోభాన్ని తొలగించాడు. అప్పటి నుంచి అన్నపూర్ణ మాత నివాసం ఉండటం వల్ల భోలేనాథ్ నగరంలో ఎవరూ ఆకలితో ఉండరని చెబుతారు.

కెనడాకు చెందిన రెజీనా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తప్పును సరిదిద్దుతూ గత ఏడాది ఒట్టావాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు విగ్రహాన్ని అందజేశారు. ఈ విగ్రహం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASI కెనడా నుంచి తిరిగి తీసుకొచ్చారు. అక్టోబర్ 15 న ఈ విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. 2014 నుంచి 2020 వరకు 41 వారసత్వ వస్తువులు, శిల్పాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. ఇది 75 శాతం కంటే ఎక్కువ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం కెనడాతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి కూడా అనేక శిల్పాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి.

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!

Latest Articles