Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే..!
Weekly Horoscope

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలా మంది ఉన్నారు...

Srinivas Chekkilla

|

Nov 16, 2021 | 6:37 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలా మంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్‌ 16)న శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం:

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం. వ్యక్తిగత అవసరాల కోసం అడ్డూఅదుపూ లేకుండా చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి.

వృషభం:

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. గురు నామాన్ని జపిస్తే మంచిది. మీ ఆలోచనలను ఆచరణలోకి తేవడం, మీ అభిరుచికి తగినట్టుగా ప్రవర్తించడం మంచిది.

మిథునం:

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటకం:

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కోర్టు కేసులో గెలిచే సూచనలున్నాయి. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

సింహం:

చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యాన శ్లోకం చదవండి. మీ ప్రత్యర్థులు బాధపెట్టడానికి ప్రయత్నించవచ్చు

కన్య:

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. గతంలో నిలిపివేసిన పనులు ఇవాళ చేస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

తుల:

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది. ఇతరుల భాగస్వామ్యంతో వ్యాపారం చేసినవారు.. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

వృశ్చికం:

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

ధనస్సు:

మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయవద్దు. అభివృద్ధి కోసం ఎక్కువ సమయాన్ని వినియోగించండి. చంద్రధ్యానం చేస్తే మంచిది.

మకరం:

ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.

కుంభం:

ఉత్సాహంగా పని చేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

మీనం:

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జన్మరాశిలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. శివారాధన శుభప్రదం. చిన్ననాటి సన్నిహితులను కలుసుకుంటారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu