Pakistan: ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితాలో పాకిస్థాన్ తర్వాత భారత్‌కు చోటు.. గాలప్ సర్వేపై సర్వత్రా విమర్శలు..

ఈ గ్యాలప్ సర్వే సంచలనం సృష్టించింది. దీని వాస్తవికతను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే ఏ ప్రాతిపదికన భారత్ కంటే పాకిస్థాన్‌ను సురక్షితమైన దేశంగా అభివర్ణించిందని ప్రజలు అంటున్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

Pakistan: ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితాలో పాకిస్థాన్ తర్వాత భారత్‌కు చోటు.. గాలప్ సర్వేపై సర్వత్రా విమర్శలు..
most-secure-country-pakistan
Follow us

|

Updated on: Oct 28, 2022 | 11:10 AM

ఒక సర్వేలో భారతదేశం కంటే పాకిస్తాన్ సురక్షితమైనదని అభివర్ణించారు. తన సర్వేలో భారతదేశం సురక్షితమైన దేశంగా 60వ స్థానంలో ఉందని.. పాకిస్థాన్ 42వ స్థానంలో నిలిచిందని గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ పేర్కొంది. ఈ సర్వే  121 దేశాల్లో నిర్వహించగా..  జాబితాలో సింగపూర్ 96 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో.. ఆఫ్ఘనిస్తాన్ చివరి ప్లేస్ లో నిలిచింది. సింగపూర్ తర్వాతి స్థానాల్లో తజికిస్థాన్, నార్వే, స్విట్జర్లాండ్ , ఇండోనేషియాలు మొదట  ఐదు స్థానాల్లో వరసగా నిలిచాయి. దక్షిణ అమెరికాలోని వెనిజులా, ఆఫ్రికాలోని సియెర్రా లియోన్, కాంగో , గాబన్ చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ఈ గ్యాలప్ సర్వేలో.. దేశాలకు 1 నుండి 100 స్కోర్ ఇవ్వబడింది. అనేక దేశాలు 80 కంటే ఎక్కువ స్కోర్ చేశాయి. అవి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా పరిగణించబడ్డాయి. ఈ సర్వేలో భారత్ 80 స్కోర్‌తో 60వ స్థానంలో నిలవగా, పాకిస్థాన్ 82 స్కోర్‌తో 42వ స్థానంలో నిలిచింది. ఈ గ్యాలప్ సర్వేలో, భారతదేశం తో సమానంగా ఇరాక్ , శ్రీలంక దేశాలున్నాయి.

ఇరాక్ , శ్రీలంక కూడా 80-80 స్కోర్‌లను కలిగి ఉన్నాయి. అమెరికా, ఇటలీ , జర్మనీ ఈ మూడు దేశాలు 82 స్కోర్ ను సొంతం చేసుకున్నాయి.  అదే సమయంలో ఇరాన్, న్యూజిలాండ్ లు 82 స్కోర్ తో పాకిస్థాన్‌తో కలిసి ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్కోరు 84 కాగా, కెనడా స్కోరు 87.

ఇవి కూడా చదవండి

గాలప్ సర్వేపై రచ్చ  ఈ గ్యాలప్ సర్వే సంచలనం సృష్టించింది. దీని వాస్తవికతను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే ఏ ప్రాతిపదికన భారత్ కంటే పాకిస్థాన్‌ను సురక్షితమైన దేశంగా అభివర్ణించిందని ప్రజలు అంటున్నారు. పాకిస్థాన్‌లో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా,  బలూచిస్తాన్ లో జరిగిన హింసాత్మక సంఘటనలు అసలు పరిగణలోకి తీసుకున్నారా.. తమ దేశంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరిందని ఆ దేశ  మంత్రి స్వయంగా అంగీకరించారు. అటువంటి పరిస్థితిలో, భారతదేశం కంటే పాకిస్తాన్ మరింత సురక్షితమైనదని ఎలా సర్వేలో నిర్ధారించారా చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

1,27,000 మందిని ఇంటర్వ్యూ చేశారు గ్యాలప్ 2021- 2022 ప్రారంభంలో 122 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాల్లో 15 ఏళ్ల పైబడిన 1,27,000 మంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేసింది. అన్ని దేశాల నుండి దాదాపు 1000 మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా ముఖాముఖి కూర్చుని సర్వేలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

సర్వేలో అడిగిన ప్రశ్నలు:- మీరు నివసిస్తున్న నగరం లేదా ప్రాంతంలోని స్థానిక పోలీసు బలగాలను మీరు విశ్వసిస్తున్నారా? మీరు నివసించే నగరం లేదా ప్రాంతంలో రాత్రిపూట ఒంటరిగా నడవడం మీకు సురక్షితంగా అనిపిస్తుందా? గత 12 నెలల్లో మీ నుండి లేదా ఇతర కుటుంబ సభ్యుల నుండి డబ్బు లేదా ఆస్తి దొంగిలించబడిందా? గత 12 నెలల్లో మీరు దాడికి గురయ్యారా లేదా దోపిడీకి గురయ్యారా?

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..