Elon Musk: టాటూస్ ఎక్కడున్నాయో చెప్పండి.. లైంగిక ఆరోపణలపై స్పందించిన ఎలాన్ మస్క్..

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆ ఆరోపణల్లో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేశారు.

Elon Musk: టాటూస్ ఎక్కడున్నాయో చెప్పండి.. లైంగిక ఆరోపణలపై స్పందించిన ఎలాన్ మస్క్..
Tesla CEO Elon Musk
Follow us
Janardhan Veluru

|

Updated on: May 20, 2022 | 6:33 PM

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆ ఆరోపణల్లో నలుసంత నిజం కూడా లేదంటూ కొట్టిపారేశారు. 2016లో ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఎలాన్ మస్క్ అందులో ప్రయాణిస్తున్న తన సహాయకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని అంతర్జాతీయ మీడియా(Business Insider)లో ఓ సంచలన కథనం వెలువడింది. బాధితురాలికి రెండున్నర లక్షల డాలర్లు చెల్లించి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు ఆ కథనం తెలిపింది. ఎలాన్ మస్క్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి ఫ్రెండ్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ఈ కథనం ప్రచురించింది. అయితే తనపై వచ్చిన ఈ సంచలన ఆరోపణలు పూర్తి అసత్యాలుగా మస్క్ ట్వీట్ చేశారు. తనపై ఈ ఆరోపణలను నిరూపించగలరా? అంటూ సవాల్ చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న అబద్ధాలకోరు.. బయటకు కనిపించని తన శరీరంపై ఉన్న టాటూస్, మానిన గాయానికి సంబంధించిన మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో? చెప్పాలన్నారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేనందున.. ఇవి చెప్పలేరని పేర్కొన్నాడు.

ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను ప్రభావితం చేసేందుకే ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. స్నేహితురాలి పేరిట తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి లాస్ ఏంజెల్స్‌కు చెందిన వాపపక్ష భావజాలం కలిగిన నటిగా ఆరోపించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తేటతెల్లం అవుతోందన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే