Donald Trump: ‘మనల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించేది వ్యాక్సిన్ ఒక్కటే’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్.
Donald Trump: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. యావత్ మానవాళిని గడతడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల చాలా మంది ప్రజలు...
Donald Trump: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. యావత్ మానవాళిని గడతడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల చాలా మంది ప్రజలు వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడంలేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనో మరే కారణంతోనో కానీ వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపించడంలేదు. ఇది కేవలం మన దేశానికే పరిమితం కాదు విదేశాల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో తేలిన వివరాల ప్రకారం 47 శాతం మంది రిపబ్లికన్స్ టీకా తీసుకోవడం పట్ల ఆసక్తి చూపడంలేదని తేలింది. దీంతో ఈ వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ట్రంప్.. తన మద్ధతుదారులు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల్లో నాకు ఓటు వేసిన వారు తప్పకుండా టీకా తీసుకోండి. ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైంది, బాగా పనిచేస్తోంది. ఈ టీకాల తయారీ కోసం ఫార్మా కంపెనీలు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) పగలు రాత్రి అనే తేడా లేకుండా కృషి చేస్తున్నాయి. టీకా మాత్రమే మనల్ని మహమ్మారి నుంచి రక్షిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఇక పనిలో పనిగా అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ విమర్శలు కురిపించారు. సరిహద్దు సంక్షోభం, చమురు ధరల పెంపు విషయమై అధ్యక్షుడిని ట్రంప్ విమర్శించారు.