Covid-19 Vaccine: ఏడు నెలల శిశువుకు కోవిడ్ వ్యాక్సిన్.. పొరపాటున వేసిన డాక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే?
దక్షిణ కొరియాలోని ఓ ఏడు నెలల శిశువుకు ఫ్లూ టీకాకు బదులుగా కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారని స్థానిక అధికారులు శనివారం పేర్కొన్నారు.
Covid-19 Vaccine: దక్షిణ కొరియాలోని ఏడు నెలల చిన్నారికి ఫ్లూ షాట్‌కు బదులుగా పొరపాటున కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేసినట్లు స్థానిక అధికారులు శనివారం తెలిపారు. సియోల్‌కు దక్షిణంగా ఉన్న సియోంగ్నామ్‌లోని చిన్న పిల్లల డాక్టర్ పొరపాటున శిశువుకు మోడెర్నా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందించాడు.
ఇది శిశువు తల్లి కోసం సెప్టెంబర్ 29న ఇవ్వాల్సిన వ్యాక్సిన్ అని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ రాసుకొచ్చింది.
శిశువుకు ఐదు రోజుల పాటు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని అధికారులు తెలిపారు.
ఇలా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంతో దానికి పరిహారం ఇవ్వాలని కోరుతూ తల్లిదండ్రులు ఆ వైద్యునిపై దావా వేసినట్లు సమాచారం.
Also Read: Omicron Variant: ఒమిక్రాన్ టెన్షన్.. భారత్‌లో కొత్తగా మరో 8 కొత్త వేరియంట్ కేసులు.. ఎక్కడంటే..!
PM Modi in UP: యోగి వైపే యూపీ ప్రజలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు