China Corona: మళ్లీ విజృంభణ.. రెండేళ్ల తర్వాత చైనాలో మొదలైన కరోనా మరణాలు..!
China Corona: గత రెండేళ్లకుపైగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. మళ్లీ తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా (China)లో మళ్లీ తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు..
China Corona: గత రెండేళ్లకుపైగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. మళ్లీ తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా (China)లో మళ్లీ తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో రెండేళ్ల తర్వాత కొత్తగా రెండు కరోనా మరణాలు (Covid-19 Death)నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు నివేదించారు. ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపాయన్ని సంతరించుకుంటూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇక దక్షిణ కొరియాలో కూడా అదే తరహాలో కొత్త కరోనా కేసులు నమోవు అవుతుండటంతో భయాందోళన నెలకొంది.
రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్ తీవ్రతరం అవుతోంది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాంటి కేసులు లేకుండా కట్టడి చేసిన చైనా.. రెండేళ్ల తర్వాత మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఇక మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు చైనాలో తగ్గడం లేదు. అయితే చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. చైనాలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు వాడుతున్నారని తెలిపిన ఆయన.. అవి ఫైజర్ వ్యాక్సిన్‌లా సమర్థంగా పని చేయట్లేదని వెల్లడించారు.
13 నగరాల్లో కఠిన ఆంక్షలు:
చైనాలో కరోనా విజృంభిస్తుండటంతో కఠిన ఆంక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. చైనాలోని 13 నగరాలలో కఠిన ఆంక్షలు చేపడుతోంది. చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు విధించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్లో 3 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి: