Omicron India: తస్మాత్ జాగ్రత్త!.. కేర్‌లెస్‌గా ఉన్నారో పాత రోజులు రిపీట్.. కేంద్రం సీరియస్ వార్నింగ్..!
Omicron India: కరోనా ఎక్కడికి పోలేదు.. ఇక్కడిక్కడే తిరుగుతోంది. దేశానికి ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది
Omicron India: కరోనా ఎక్కడికి పోలేదు.. ఇక్కడిక్కడే తిరుగుతోంది. దేశానికి ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాత రోజులు రిపీట్ అవుతాయని హెచ్చరించింది. గత కొద్ది వారాలుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. మళ్లీ విజృంభిస్తోంది. చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలున్నట్టు నిపుణులు భయపడుతున్నారు.
వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్రం. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. కరోనా వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్, ట్రాక్, ట్రీట్, కొవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని కోరింది. కరోనా టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని, కొత్త కేసుల క్లస్టర్లపై నిఘా పెట్టాలని కోరింది. పండుగ వేళల్లో గతంలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకే ఇది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్రం అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలని కూడా ఆరోగ్యశాఖ లేఖలో పేర్కొంది.
కాగా, భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంది. అయితే , మరణాలు మాత్రం కాస్త పెరిగాయి. 24 గంటల్లో దేశంలో 2,538 కేసులు నమోదవ్వగా.. 149 మరణాలు చోటుచేసుకున్నాయి. క్రియాశీల కేసులు 30వేల దిగువకు పడిపోయాయి.
Also read: