Omicron – india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!

Omicron - india: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై పంజా విసిరింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్, మళ్లీ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైంది కేంద్ర సర్కార్. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్,

Omicron - india: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న ఒమిక్రాన్.. కీలక నిర్ణయం దిశగా భారత ప్రభుత్వం..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 18, 2022 | 6:00 AM

Omicron – india: కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై పంజా విసిరింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్, మళ్లీ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైంది కేంద్ర సర్కార్. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యింది కేంద్రం. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష కోసం, అత్యుతన్న స్థాయి సమావేశం నిర్వహించారు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. జీనోమ్ సీక్వెన్సింగ్, పర్యవేక్షణతో పాటు అప్రమత్తతంగా ఉండాలని మాండవియా సూచించారు. మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసుల ప్రారంభించాలనే నిర్ణయంపై కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి అధికార వర్గాలు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తారా? లేక తాజాగా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తారా అన్నది చూడాలి.

ఇప్పుడైతే, దేశంలో కరోనా కేసులు స్వల్ప సంఖ్యలో నమోదవుతున్నా, జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో 3 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వందలోపే ఉంటోంది. ప్రస్తుతం దేశంలో 33 వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు పరిస్థితి అదుపులోనే ఉన్నా, ఇకపై ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. దేశంలో ఇప్పటి వరకూ 4కోట్ల 29 లక్షల 98వేల 938 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో రికవరీ రేటు 98.72 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అటు టీకాల పంపిణీపై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది సెంట్రల్‌ గవర్నమెంట్.

Also read:

Telangana: అంతా బావే చెశాడు.. మ్యాటర్ తెలిసిన తరువాత ఆ యువతి ఏం చేసిందంటే..

Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట