Covid-19 4th Wave: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్

Covid-19 4th Wave India: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కొన్నాళ్లు శాంతించిన మహమ్మారి, మళ్లీ కోరలు చాస్తోంది. చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ

Covid-19 4th Wave: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
Corona Cases
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 19, 2022 | 8:04 AM

Covid-19 4th Wave India: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కొన్నాళ్లు శాంతించిన మహమ్మారి, మళ్లీ కోరలు చాస్తోంది. చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలకు అలెర్ట్ చేసింది. కాగా.. ఇప్పటికే వేవ్‌లు, వేరియంట్లతో కరాళనృత్యం చేసింది కరోనా వైరస్. లక్షలాది మందిని బలి తీసుకుంది. కొన్ని వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, చైనా సహా ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కొన్ని రోజులుగా కొత్త ( Coronavirus ) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, కొవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.

వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, కొత్త కేసుల క్లస్టర్లపై నిఘా పెట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలని స్పష్టం చేశారు రాజేశ్‌ భూషణ్‌. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. కరోనాపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంటోందని వెల్లడించింది WHO. పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని, ప్రజలు నిబంధనలు పాటించాలని కోరింది. అటు మన దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంది.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ BA2 తో దక్షిణ కొరియాలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతోపాటు యూకే సహా యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే.. దేశంలో మరొక వేవ్ వచ్చే అవకాశం లేదని.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై డాక్టర్ సుభాష్ సలుంఖే మాట్లాడుతూ.. దేశంలో ఫోర్త్ వేవ్ రాదన్న విషయాన్ని కూడా కొట్టిపారేయలేము అన్నారు. దాని తీవ్రత మునపటిలా మాత్రం ఉండదన్నారు. ముంబై డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ.. కరోనా ఫోర్త్ వేవ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ లో రూపాంతరం చెందిన కొత్త వేరియంట్‌పై అంతగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Also Read: Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Vultures: ఒకేసారి వంద రాబందుల మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరికొన్ని.. అసలేమైందంటే..