Adani: తగ్గేదే లే.. అంబానీకి చెక్ పెట్టేందుకు పెట్టుబడుల వ్యూహం మార్చిన అదానీ..
Adani: అంబానీలకు గట్టి పోటీగా నిలిచేందుకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తీవ్రంగా కృషి చేస్తున్నారు. మెున్న అనిల్ అంబానీ ఆస్తులను కొనేందుకు బిడ్డింగ్ వేసిన అదానీ.. తాజాగా పెట్రో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నారు.
Adani: అంబానీలకు గట్టి పోటీగా నిలిచేందుకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తీవ్రంగా కృషి చేస్తున్నారు. మెున్న అనిల్ అంబానీ ఆస్తులను కొనేందుకు బిడ్డింగ్ వేసిన అదానీ.. తాజాగా పెట్రో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందుకోసం సౌదీ అరేబియాకు చెందిన దిగ్గజ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సౌదీకి చెందిన దిగ్గజ చమురు కంపెనీ అయిన సౌదీ ఆరామ్‌కోలో(Saudi Aramco) వాటా కొనుగోలుకు కంపెనీ యత్నిస్తున్నట్లు సమాచారం. పరస్పర సహకారం, ఉమ్మడి పెట్టుబడి అవకాశాలకు సంబంధించి సౌదీ ఆరామ్‌కోతో పాటు సౌదీకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్)తో కూడా అదానీ గ్రూపు ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అంతర్గత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఆరామ్‌కోలో వాటా కొనుగోలు కోసం నగదు రూపేణా అదానీ పెట్టుబడులు పెట్టకపోవచ్చని, ఆస్తుల బదిలీ ఒప్పందం ద్వారా లావాదేవీని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పునరుత్పాదక విద్యుత్, క్రాప్ న్యూట్రియెంట్స్, రసాయనాల విభాగాల్లో ఆరామ్‌కో లేదా దాని అనుబంధ సంస్థ సబిక్‌తో అదానీ జట్టు కట్టనుంది. అలాగే పీఐఎఫ్‌కు భారత్‌లోని మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని అదానీ కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన చర్చలు తొలి దశలోనే ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆరామ్‌కో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. సుమారు 15 బిలియన్ డాలర్ల విలువైన వాటాల కొనుగోలుకోసం జరిగిన చర్చలు ఎట్టకేలకు ఆగిపోయాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టడంపై తమకు ఆసక్తి ఉందని ఆ సమయంలో ఆరామ్‌కో స్పష్టం చేసిన విషయం తెలిపిందే.
ఇవీ చదవండి..
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్‌లో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Rakesh Jhunjhunwala: ఒక్క రోజులోనే అమాంతం పెరిగిన బిగ్ బుల్ పెట్టుబడుల విలువ.. ఎంతమేరంటే..