Russian Crude Oil: ప్రపంచంలో ఎవరు తక్కువ ధరకు చమురు అమ్మినా కొంటాం: భారత్

Russian Oil: ఉక్రెయిన్ పై రష్యా వార్(Russia Ukraine War) ప్రారంభించటంతో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రూడ్ ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి.

Russian Crude Oil: ప్రపంచంలో ఎవరు తక్కువ ధరకు చమురు అమ్మినా కొంటాం: భారత్
Crude oil
Ayyappa Mamidi

|

Mar 19, 2022 | 9:16 AM

Russian Oil: ఉక్రెయిన్ పై రష్యా వార్(Russia Ukraine War) ప్రారంభించటంతో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రూడ్ ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి. అసలే దేశీయ చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే భారత్ కు ఇది మరింత భారంగా మారింది. ఈ సమయంలో రష్యా డిస్కౌంట్(Oil On Discount) రేట్లకు క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసేందుకు ఆఫర్ ఇచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు చమురు కంపెనీలు భారీగా ఆర్డర్లు పెట్టాయి. దీనిపై అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను ఇప్పుడు భారత్ గట్టిగా తిప్పికొడుతోంది. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకమైనందున.. ఎక్కడ చౌక ధరలకు చమురు దొరికినా కొంటామని.. ఇలాంటి ఆఫర్లు ఇచ్చే కంపెనీలను ఆహ్వానిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. రష్యా నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతులకు ఆంక్షలు వర్తించనప్పటికీ ఆ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు చేయటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది. అయినా.. దేశ ముడి చమురు అవసరాల కోసం రష్యా నుంచి చేసుకుంటున్న దిగుమతులు ఒక్క శాతం కన్నా తక్కువైనవేనని తెలిపాయి.

ప్రస్తుతం జరుగుతున్నది.. రెండు దేశాల ప్రభుత్వాల మధ్య వ్యాపారం జరగడంలేదని గుర్తు చేశాయి. భారత వ్యాపారులు ప్రపంచ మార్కెట్లలో ఎక్కడ చౌకగా ఇంధనం లభిస్తే అక్కడి నుంచి కొనుగోళ్లు జరుపుతున్నారని స్పష్టం చేశాయి. రష్యా నుంచి డిస్కౌంట్‌ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసే విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి స్పందిస్తూ.. “ఇంధన అవసరాలకు భారత్‌ అత్యధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ అవసరాల రీత్యా ప్రపంచ మార్కెట్లలో ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తుంటాం. అనేక దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాలు కూడా ఇదే పనిచేస్తున్నాయి. భారత్‌పై విమర్శలు చేసే వారిని వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా” అని అన్నారు. రష్యా, భారత్‌ల మధ్య రూబుల్‌, రూపాయి మారకంలో వాణిజ్యం గతంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఇదేసమయంలో భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇరాన్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. థర్డ్‌పార్టీతో సంబంధం లేకుండా నేరుగా భారత్ కు చమురు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్ననట్లు ఆ దేశ రాయబారి వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం స్పష్టమౌతోంది. ఇరుదేశాల కరెన్సీ(రూపాయి-రియాల్‌)లోనే లావాదేవీలు జరుపుకోవచ్చని భారత్‌లో ఇరాన్‌ రాయబారి అలీ చెగెనీ ఓ కార్యక్రమంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇరాన్‌.. భారత రిఫైనరీలు చెల్లించాల్సిన మొత్తాలను ఎగుమతుల చెల్లింపులకు ఆ దేశం వినియోగించింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పెట్టిన ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతులను అప్పట్లో నిలిపివేసింది. చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభమైనట్లయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం 30 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అలీ చెగానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

Adani: తగ్గేదే లే.. అంబానీకి చెక్ పెట్టేందుకు పెట్టుబడుల వ్యూహం మార్చిన అదానీ..

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu