Credit score: బ్యాడ్ క్రెడిట్ స్కోర్ వల్ల ఇన్ని నష్టాలా..! తప్పక తెలుసుకోండి..

Credit score: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్(Finance Companies) కంపెనీలు రుణాలు మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ ను తప్పక చూస్తాయి. వారి క్రెడిట్ రేటింగ్(CIBIL Score) ఆధారంగా రుణ గ్రహీతకు లోన్ ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటాయి.

Credit score: బ్యాడ్ క్రెడిట్ స్కోర్ వల్ల ఇన్ని నష్టాలా..! తప్పక తెలుసుకోండి..
Credit Score
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 19, 2022 | 9:54 AM

Credit score: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్(Finance Companies) కంపెనీలు రుణాలు మంజూరు చేసేటప్పుడు క్రెడిట్ స్కోర్ ను తప్పక చూస్తాయి. వారి క్రెడిట్ రేటింగ్(CIBIL Score) ఆధారంగా రుణ గ్రహీత సమయానికి చెల్లింపులు చేయగలడా లేదా అనే అంశాన్ని అంచనా వేస్తుంటాయి. కొత్త లోన్ తీసుకోవటానికి ప్రయత్నించేటప్పుడు గుడ్ క్రెడిట్ స్కోర్ అవసరం. ఒక వేళ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే కొత్తగా రుణాలు పొందటం కష్టంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇలా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండే వారికి లోన్ ఇచ్చేందుకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు విముకతతో ఉంటాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

లోన్ పై అధిక వడ్డీ..

సిబిల్ స్కోర్ తక్కువగా ఉండే వారికి రుణాలు, అడ్వాన్సులు ఇచ్చేందుకు ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తుంటాయి. వారిని సబ్ ప్రైమ్ బారోవర్స్ గా పరిగణిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ రుణగ్రహీత ఆర్థిక ఆరోగ్యాన్ని, చెల్లింపుల విషయంలో పాటిస్తున్న జాగ్రత్తను, డ్యూడేట్ కి ముందు చెల్లిస్తున్నారని చెబుతుంది. రెగులర్ కస్టమర్ల కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారికి ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తుంటాయి.

ఇన్స్యూరెన్స్ అధిక ప్రీమియం..

బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉండే వారికి బీమా ప్రొవైడర్లు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తారు. బీమా కంపెనీలు నిర్ణయించిన నిర్ధేశిత సిబిల్ లేని వారికి ఈ అవస్తలు తప్పవు. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్‌లు పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు ఎక్కువ సార్లు క్లెయిమ్‌లను ఫైల్ చేసే అవకాశం ఉంటుందని కంపెనీలు భావిస్తాయి.

వీటికి తోడు.. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నించే వారికి క్రెడిట్ స్కోర్ మంచిగా లేక పోతే ఎక్కువ రేటుకు హోమ్ లోన్ లభిస్తుంది. కొన్నిసార్లు రెంట్ లేదా లీజ్ పై ప్రాప్రీర్టీ పొందటం కష్టం అవుతుంది. వీటికి తోడు గోల్డ్ లోన్, సెక్యూరిటీపై లోన్, ఆటో లోన్, వెహికల్ లోన్ ఇచ్చేముందు కంపెనీలు కస్టమర్ గురించి ఎక్కువగా ఎంక్వైరీ చేస్తాయి. ఇదే సమయంలో సిబిల్ తక్కువ ఉన్న వ్యక్తులకు వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు కష్టంగా మారతాయి. బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉండే కస్టమర్లకు కొంత మేర రుణాలు ఇస్తున్నప్పటికీ అవి కొంత పరిమితి వరకు మాత్రమే ఉన్నాయి. వీటి కారణంగా బయట వడ్డీలకు అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది. అది ఆర్థికంగా చాలా నష్టాన్ని కలిగిస్తుంది.

ఇవీ చదవండి..

Adani: తగ్గేదే లే.. అంబానీకి చెక్ పెట్టేందుకు పెట్టుబడుల వ్యూహం మార్చిన అదానీ..

Russian Crude Oil: ప్రపంచంలో ఎవరు తక్కువ ధరకు చమురు అమ్మినా కొంటాం: భారత్