AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఉపశమనం.. ఒక్కొ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు.. ఇలా పొందండి..

దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి. ఇటీవల మరోసారి డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎలా అంటే గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. ఈ మేరకు ఓ పథకాన్ని అమలు చేస్తోంది.

Gas Cylinder: పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఉపశమనం.. ఒక్కొ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు.. ఇలా పొందండి..
Lpg Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 7:13 PM

Share

ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కేంద్రం మరోసారి ధరలను పెంచడంతో రూ.వెయ్యి మార్క్‌కు చేరువలో గ్యాస్ ధరలు ఉన్నాయి. మార్చిలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఇటీవల మరో రూ.30 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం రూ.90 పెరిగినట్లయింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. గ్యాస్ ధరలు కూడా పెరగడంతో ఇది సామాన్యులపై గుదిబండగా మారింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు సబ్సిడీ అందిస్తున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తోంది. పెరిగిన ధరల నుంచి ఈ పథకాలు సామాన్యులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.

గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథఖాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రూ.300 వరకు గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ పొందవచ్చు. ఏడాదికి నాలుగు సిలిండర్ల వరకు ఈ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. గతంలో 9 సిలిండర్ల వరకు ఉండగా.. ఇటీవల 6 సిలిండర్లకు తగ్గించింది. ఇప్పుడు ఆ పరిమితిని నాలుగుకు తగ్గించింది. దీంతో ఏడాదికి నాలుగు సిలిండర్లకు ఒక్కొ సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ పొందవచ్చు. అంటే ఏడాదికి రూ.1200 కేంద్రం నుంచి వస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం ఒక్కొ గ్యాస్ సిలిండర్‌ సరఫరాకు కంపెనీలకు రూ.1600 వరకు ఖర్చు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సబ్సిడీ అందించడం వల్ల రూ.వెయ్యిలోపు ధరల్లో బహిరంగ మార్కె్ట్లో లభిస్తోంది. ఉజ్వల్ యోజన లబ్దిదారులకు రూ.300 సబ్సిడీ అందించడంలో రూ.700లోపు ధరల్లో గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు లేకుండా కనెక్షన్ పొందవచ్చు. మొదటి సిలిండర్ ఉచితంగా ఫిల్ చేసి ఇస్తారు. అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అందుతుంది.

అర్హులు ఎవరు..?

-మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి -కుటుంబంలోని ఏ ఒక్కరి పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు -రేషన్ కార్డు కలిగి ఉండాలి

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పోర్టల్ ద్వారా దరఖాస్తు ఫారం నింపి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అనంతరం గ్యాస్ ఏజెన్సీని ఎంచుకుని పథకంలో చేరవచ్చు. ఇక కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డు వంటివి అందించాల్సి ఉంటుంది.

Follow Us