AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan PM: నేడు భారత్‌కు రానున్న జపాన్ పీఎం.. ప్రధాని మోడీతో భేటీ.. పలు విషయాలపై కీలక నిర్ణయాలు..

Japan PM Fumio Kishida arrives today: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్‌కు రానున్నారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జపాన్ ప్రధాన మంత్రి

Japan PM: నేడు భారత్‌కు రానున్న జపాన్ పీఎం..  ప్రధాని మోడీతో భేటీ.. పలు విషయాలపై కీలక నిర్ణయాలు..
Fumio Kishida
Shaik Madar Saheb
|

Updated on: Mar 19, 2022 | 9:17 AM

Share

Japan PM Fumio Kishida arrives today: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్‌కు రానున్నారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) మధ్య కీలక భేటీ జరగనుంది. 14వ ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జపాన్ ప్రధాని భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతోపాటు ఉక్రెయిన్‌లో పరిస్థితిపై ఇరువురు కీలక నేతలు చర్చిస్తారు. జపాన్ ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. “భారతదేశం – జపాన్ శిఖరాగ్ర సమావేశం (మార్చి 19) ఈ రోజు జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రానున్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇండో-పసిఫిక్‌లో రక్షణ, పరస్పర సహకారంపై చర్చించనున్నారు. రక్షణ – భద్రత, ప్రాంతీయ సహకారంపై సమీక్షించనున్నారు. ఇండియా-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్‌ గురించి కూడా చర్చించనున్నారు. ఈశాన్య భారతదేశంలో కనెక్టివిటీ, అటవీ నిర్వహణ, విపత్తు ప్రమాద తగ్గింపు, సామర్థ్య నిర్మాణ రంగాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సమన్వయం చేయడం కోసం 2017లో ఒప్పందం జరిగింది. కాగా.. PM కిషిదా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 2021 అక్టోబర్‌లో ప్రధాని కిషిదాతో ఫోన్‌లో మాట్లాడారు. వ్యూహాత్మక – గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగే పర్యటనలో అభివృద్ధి చెందుతున్న భౌగోళిక-రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఇరుపక్షాలు భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి.

ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతోపాటు పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇండో పసిఫిక్, శాంతి సుస్థిరత, శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఈ సదస్సు కీలకమవుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నిర్ణయాలు సైతం తీసుకోనున్నట్లు బాగ్చి తెలిపారు. కాగా.. ఇరువురు నేతల మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. అంతకుముందు భారత్ – జపాన్ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగింది.

గత కొన్నేళ్లు వ్యూహాత్మక రంగాల్లో భారత్ – జపాన్ పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. గతంలో జపాన్ విదేశాంగ మంత్రిగా భారత్‌కు వచ్చిన ఫుమియో కిషిదా గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీని నాలుగుసార్లు కలిశారు. అయితే.. ఇది అతని మొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన. గత సంవత్సరం CoP26 కోసం గ్లాస్గోలో పర్యటించారు.

Also Read:

PM Narendra Modi: ప్రధాని మోడీనే నెంబర్‌వన్.. గ్లోబల్ లీడర్‌గా మరో రికార్డు తిరగరాసిన నమో..

Covid-19 4th Wave: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్