PM Narendra Modi: ప్రధాని మోడీనే నెంబర్‌వన్.. గ్లోబల్ లీడర్‌గా మరో రికార్డు తిరగరాసిన నమో..
Global Leader PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే నెంబర్ వన్.. ఆయన దరిదాపుల్లో ఎవరూ లేరు. ప్రపంచస్థాయి బలమైన నేతల్లో ప్రధాని మోదీ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో
Global Leader PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే నెంబర్ వన్.. ఆయన దరిదాపుల్లో ఎవరూ లేరు. ప్రపంచస్థాయి బలమైన నేతల్లో ప్రధాని మోడీ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ప్రధాని ఇమేజ్ మరింత పెరిగింది. పైగా యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో వన్‌సైడ్ విజయంతో బీజేపీతోపాటు మోదీ ప్రతిష్ట రెట్టింపయింది. తాజాగా జరిగిన సర్వేలో అతి మరింత స్పష్టంగా కనిపించింది. 13 దేశాల నేతలపై సర్వే జరిగితే మోడీ నెంబర్ వన్‌గా నిలిచారు. దాంతో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఆ సర్వేలో అవతరించారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వే చేసింది. గ్లోబల్ లీడర్ ఎవరు అన్న అంశంపై ఈ నెల 9 నుంచి 15 వరకు జరిగిన సర్వే ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. 13 దేశాల నేతలపై అభిప్రాయ సేకరణ జరిగింది. తాజాగా మార్నింగ్ కన్సల్ట్ ప్రకటించిన సర్వేలో మోదీకి పట్టంకట్టారు ప్రజలు. సర్వే జరిగిన దేశాల్లో ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, స్పెయిన్, యూకె ఉన్నాయి.
ఈ అన్ని దేశాల్లోకెల్లా మోడీకే అత్యధికంగా అనుకూలత వ్యక్తమైంది. 77 శాతం మంది మోడీకి మద్దతు పలికారు. 17 శాతం మాత్రమే వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. మోదీ తర్వాత మెక్సికో ప్రెసడెంట్ ఆండ్రస్‌కు 63 శాతం అనుకూలత కనిపించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మాత్రం కేవలం 41 శాతమే అనుకూలత ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయనపై 51 శాతం వ్యతిరేకత వ్యక్తమైందని మార్నింగ్ కన్సల్ట్ ప్రకటించింది. ప్రతి వారం ఈ సర్వే ఫలితాలను అప్‌డేట్ చేస్తారు. తాజా వీక్‌లో మోడీ నెంబర్ వన్‌గా నిలిచారు. అమెరికా కేంద్రంగా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పని చేస్తోంది. ఐదింటిలో నాలుగు రాష్ట్రాల్లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ప్రధాని మోడీ.
ఈ మేరకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్విట్ చేసి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచ నాయకుడిగా కొనసాగుతున్నారు. 77% రేటింగ్‌తో ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్‌లలో ముందుండటం గర్వకారణమన్నారు. ప్రధాని మోదీ ప్రజల నాయకుడంటూ కొనియాడారు.
PM @NarendraModi ji continues to be the most admired world leader.
With an approval rating of 77%, PM Modi Ji leads among global leaders.
He is truly a leader of the people, by the people & for the people. https://t.co/1EX6LsR9KN
— Piyush Goyal (@PiyushGoyal) March 18, 2022
పైగా ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధంతో ఆపరేషన్ గంగ చేపట్టి మన వాళ్లను సేఫ్‌గా దేశానికి తీసుకొచ్చారు. కేంద్రమంత్రులనే అక్కడికి పంపి భారతీయులకి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకున్నారు. పుతిన్‌తో, జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా మాట్లాడి ఆపరేషన్ గంగను సక్సెస్ చేశారు మోడీ. ఈ నేపథ్యంలోనే జరిగిన సర్వేలో గ్లోబల్ లీడర్‌గా మోడీకి అత్యధిక అనుకూలత రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్లోబల్ లీడర్స్..
ప్రధాని నరేంద్ర మోదీ: 77%, లోపెజ్ ఒబ్రాడోర్: 63%, డ్రాఘి: 54%, స్కోల్జ్: 45%, కిషిడా: 42%, ట్రూడో: 42%, బైడెన్: 41%, మాక్రాన్: 41%, మోరిసన్: 41%, మూన్: 40%, బోల్సోనారో: 39%, శాంచెజ్: 38%, జాన్సన్: 33%.
Also Read:
Gold Silver Price Today: స్వలంగా పెరిగి బంగారం ధర.. నిలకడగా వెండి.. తాజా ధరల వివరాలు
Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెన్ చేస్తున్నారా.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు..!