Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెన్ చేస్తున్నారా.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు..!
Emergency Fund: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెన్ చేయడం చాలా అవసరం. అత్యవసర నిధి అనేది వారి భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
Emergency Fund: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెన్ చేయడం చాలా అవసరం. అత్యవసర నిధి అనేది వారి భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది. ఊహించని ఖర్చులను భరించడమే కాకుండా లాభసాటి పెట్టుబడులను నిర్వహించగలరు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఫండ్‌ని మెయింటెన్ చేస్తారు. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు 3 నుంచి 6 నెలల వరకు మీ ఖర్చులను కవర్ చేసే ఫండ్. ఎందుకంటే మీరు కొన్ని ఖర్చులను నివారించలేరు. వాటిని కచ్చితంగా భరించాల్సిందే. ఈ ఫండ్ ముఖ్యమైన ఉపయోగం కొంత కాలం పాటు ఆదాయ వనరులు లేనప్పుడు మీకు ఆర్థిక భరోసా కల్పంచడం. ఇందులో అనారోగ్యం, ప్రమాదం, ఉద్యోగం కోల్పోవడం, జీతం తగ్గడం లాంటివి జరిగినప్పుడు ఈ ఫండ్స్ మీకు ఉపయోగపడుతాయి. ప్రజలందరూ అలాంటి అత్యవసర నిధులను సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా దీని గురించి పట్టించుకోరు. దీంతో ఆపద సమయలో చాలా సమస్యలని ఎదుర్కొంటారు.
సరైన ఫండ్ క్రియేట్ చేయలేకపోవడం: చాలా సార్లు ప్రజలు తమ అవసరాల కంటే తక్కువ నిధిని సిద్ధం చేసుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు ఆ నిధులు సరిపోవు. దీంతో మళ్లీ ధీర్ఘకాలిక పెట్టుబడులను విచ్ఛిన్నం చేయవలసి ఉంటుంది. లేదా రుణం తీసుకోవలసి వస్తుంది.
పెట్టుబడి ఎంపిక సరికాదు: ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడానికి చాలామంది దీర్ఘకాలిక FD లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెడుతారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మీ ఫండ్ అనేది తీసుకోవడానికి సులభంగా ఉండే పెట్టుబడులలో ఉండాలి. మీరు మీ అత్యవసర నిధులను పొదుపు ఖాతాలో 50 శాతం, స్వల్పకాలిక FDలలో 30 శాతం, లిక్విడ్ ఫండ్స్ 20 శాతంలో ఉంచుకోవచ్చు.
అత్యవసర ఖర్చుల కోసం మాత్రమే: ఎమర్జెన్సీ ఫండ్ ఉద్దేశ్యం అత్యవసర సమయంలో మాత్రమే ఈ నిధులని ఉపయోగించాలి. కానీ కొంతమంది షాపింగ్ లేదా ప్రయాణంలో ఖర్చు చేస్తారు. ఇది సరైన పద్దతి కాదు. అందుకే ఎమర్జెన్సీ ఫండ్‌ని బ్యాంకుకి దూరంగా ఉంచడం మంచిది. ఒకవేళ అత్యవసర నిధిలో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఉంటే మీరు ఆ అదనపు మొత్తాన్ని వాడుకోవచ్చు.