AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC: ఏసీ కొనాలంటే చాలా ఖర్చు.. కానీ ఇలా చేస్తే చాలా సులువు..!

AC: ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకి డిమాండ్‌ పెరిగింది. ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏసీ అయితే సామాన్యులు

AC: ఏసీ కొనాలంటే చాలా ఖర్చు.. కానీ ఇలా చేస్తే చాలా సులువు..!
Ac
uppula Raju
|

Updated on: Mar 19, 2022 | 5:51 AM

Share

AC: ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకి డిమాండ్‌ పెరిగింది. ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏసీ అయితే సామాన్యులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో ఉన్న ఏకైక మార్గం ఏసీని అద్దెకు తీసుకోవడం మాత్రమే. వాస్తవానికి ఏసీలు అద్దెకిస్తారని చాలా మందికి తెలియదు. కానీ మీరు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా AC అద్దెకు తీసుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మీరు దానిపై ఎటువంటి నిర్వహణ ఖర్చును భరించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు డబ్బులు కూడా పొదుపు చేయొచ్చు. ఏదైనా ఆన్‌లైన్ రెంటల్ సైట్ నుంచి AC తీసుకునే ముందు మీరు దానిలోని అన్ని నిబంధనలు, షరతులను తప్పక చదవాలి. ఇది కాకుండా డబ్బు చెల్లించే ముందు కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు కాల్ చేసి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోండి. వెబ్‌సైట్ ప్రామాణికతను ధ్రువీకరించుకుంటే మంచిది. మీరు ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్గావ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే ACని అద్దెకు తీసుకోవచ్చు.

Rentmojo అనేది Android, iOS, వెబ్‌లో అందుబాటులో ఉండే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్. దీంతో మీరు ఢిల్లీ, నోయిడా, ముంబై, చెన్నై అనేక ఇతర నగరాల్లో ఏసీలని అద్దెకి తీసుకోవచ్చు. మీరు ఎంతకాలం ఏసీని అద్దెకు తీసుకుంటారనే దానిపై అద్దె డబ్బులు లెక్కిస్తారు. Rentmojo ఉచిత రీలొకేషన్ అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీని లైనప్ నెలకు రూ.1,399 నుంచి ప్రారంభమవుతుంది. ఒక స్ప్లిట్ ఎయిర్ కండీషనర్‌ను అద్దెకు తీసుకోవడానికి మీరు రూ. 1,949 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అది తిరిగి చెల్లిస్తారు. రెంటోమోజో ఇన్‌స్టాలేషన్ ఛార్జీగా రూ.1,500 వసూలు చేస్తుంది.

సిటీఫర్నిష్ అనేది వేసవిలో ACల డిమాండ్‌లను తీర్చగల మరొక అద్దె సేవ. మీరు 1-టన్ను విండో ACని అద్దెకు తీసుకోవాలనుకుంటే నెలకు రూ.1,069 వసూలు చేస్తుంది. ఇందులో రూ. 1,000 ఇన్‌స్టాలేషన్ ఫీజు, రూ.2,749 సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉంటుంది. 1 టన్ను స్ప్లిట్ ఏసీకి నెలకు రూ.1,249, ఏసీని ఇన్‌స్టాల్ చేయడానికి రూ.1,500, సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2,799 చెల్లించాల్సి ఉంటుంది.

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..