AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO Warns: కోవిడ్‌ ఇంకా దృఢంగా ఉంది.. మరిన్ని వేరియంట్లు పుట్టకొస్తాయ్‌: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

WHO Warns: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత రెండేళ్లకుపైగా కొనసాగుతున్న..

WHO Warns: కోవిడ్‌ ఇంకా దృఢంగా ఉంది.. మరిన్ని వేరియంట్లు పుట్టకొస్తాయ్‌: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
Subhash Goud
|

Updated on: Mar 19, 2022 | 10:09 AM

Share

WHO Warns: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో కోవిడ్‌ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత రెండేళ్లకుపైగా కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తగ్గుముఖం పట్టిందనుకునే లోపే మళ్లీ కేసులు పెరిగిపోతున్నాయి. ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల (Corona Cases) నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెబుతోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని భావించకూడదని, దేశాలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.

కరోనా ఇంకా దృఢంగా నేంది:

కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని, నిర్లక్ష్యం చేస్తే మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో కోవిడ్‌ వ్యాప్తి మరింతగా ఉందని వెల్లడించింది. వైరస్‌ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్‌ వ్యాధిలా మారలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర విభాగానికి చెందిన హెడ్‌ డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు.

మరో ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాలి..

కరోనా విషయంలో మరో ఏడాది పాటు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ సూచిస్తోంది. లేదంటే కొత్త వేరయంట్లు పుట్టుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సూచిస్తున్నారు. వైరస్‌ ఇంకా ఎంతో దృఢంగానే ఉందని, ఈ విషయాన్ని సైతం నిపుణులు ధృవీకరించారు.

వ్యాక్సిన్ల శక్తి తగ్గిపోయి.. రోగనిరోధక శక్తి క్షీనిస్తోంది

వ్యాక్సిన్ల శక్తి తగ్గిపోయి రోగనిరోధక శక్తి మరింతగా క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి మళ్లీ వణికిస్తోందని డాక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వెల్లడించారు. రానున్న రోజుల్లో కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

తీవ్ర స్థాయిలో ఒమిక్రాన్‌..

కరోనా తగ్గుముఖం పట్టినా.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చి మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, కొద్ది రోజుల క్రితమే డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని డబ్ల్యూహెచ్‌వో అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతర కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తాజాగా చైనాలో రెండు మరణాలు:

ఇక చైనాలో రెండేళ్ల తర్వాత కొత్తగా రెండు కరోనా మరణాలు సంభవించినట్లు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు నివేదించారు. చైనాలో మరోసారి తీవ్ర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలో రోజువారిగా వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనాలోని 13 ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోంది చైనా ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

China Corona: మళ్లీ విజృంభణ.. రెండేళ్ల తర్వాత చైనాలో మొదలైన కరోనా మరణాలు..!

World Most Happiest Country 2022: ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు.. మళ్లీ అగ్రస్థానంలో ఆ దేశం