Zelenskyy: అసోంలో మార్మోగుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరు.. విషయం ఏంటంటే..
Zelensky: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ బ్రాండ్ పేరుతో ఓ చాయ్ పత్తి మార్కెట్లో విడుదలైంది. రష్యాతో..
Zelenskyy: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ బ్రాండ్ పేరుతో ఓ చాయ్ పత్తి మార్కెట్లో విడుదలైంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్‌స్కీ పేరు మీదుగా బ్లాక్ టీ పౌడర్‌ను అసోం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ మార్కెట్లో విడుదల చేసింది. రియల్లీ స్ట్రాంగ్ (Really Strong).. స్ట్రాంగ్ అస్సాం బ్లాక్ టీ అంటూ క్యాప్షన్స్ కూడా పెట్టింది. ఉక్రెయిన్ నుంచి సేఫ్‌గా పారిపోయేందుకు సహాయం చేస్తామన్న అమెరికా ఆఫర్ ను తిరస్కరించినప్పుడే జెలెన్ స్కీ ధైర్యం ఎంటో బయటపడిందని, అందుకే ఆయన పేరిట తాము ఓ బ్రాండ్‌ను ప్రారంభించామని అరోమిక్ టీ డైరెక్టర్ రంజిత్ బారువా చెప్పారు. అతని వ్యక్తిత్వాన్ని మా టీ పౌండర్ తో పోల్చుతూ క్వాలిటీని ప్రతిబింబించేలా చేస్తున్నాం. ఈ టీ పొడి ఆన్‌లైన్‌లోనూ అమ్మకానికి దొరుకుతుంది అని రంజిత్ బారువా వ్యాఖ్యానించారు. అయితే రష్యాను శౌర్యంతో, ధైర్యంతో అడ్డుకుంటున్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పేరు పెట్టి గౌరవించింది అస్సాం సీటీసీ టీ.
రష్యా దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మరో వైపు ఉక్రెయిన్ ఈ సంవత్సరంలో భారత దేశం నుంచి 1.73 మిలియన్ కిలోల టీ పొడిని దిగుమతి చేసుకుంది. టీ ప్లాంటర్లు, ఎగుమతిదారులు రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో సాధారణంగా డాలర్లతో చెల్లింపులు ప్రభావితం అవుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Like the strong Assam tea, Zelenskyy also symbolises strength in today’s context. #Assamtea #zelensky #Ukraine pic.twitter.com/Q2rbX0WdHA
— roopakgoswami (@roopak1966) March 15, 2022
రష్యాతో జరుగుతున్న వార్‌లో ఉక్రెయిన్ సైన్యం ధీటుగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరుపై టీ పొడి మార్కెట్లోకి విడుదల కావడంతో చర్చనీయాంశంగా మారింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్ స్కీ కి గౌరవార్థం ఆయన పేరు మీదుగా.. జెలెన్ స్కీ బ్లాక్ టీ పౌడర్‌ను అస్సాం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ విడుదల చేసింది.
North Eastern state of India??, Assam based start-up, has launched a CTC tea named after Ukraine President Volodymyr Zelensky to “honour his valor and courage” in the face of the Russian invasion. @ZelenskyyUa @InnaSovsun @kiraincongress @PysarenkoMaria #Ukraine #UkraineWar pic.twitter.com/hYUcTgk6qP
— Vicky Mahanta (@VickyMahanta) March 18, 2022
ఇవి కూడా చదవండి: