AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 126 భవనాల ధ్వంసం, 21మందికి గాయాలు, పగిలిన గ్యాస్ పైప్‌లైన్,

బీజింగ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రాలు ప్రకంపనల తీవ్రత 5.5 అని చెబుతున్నాయి. అయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే రిక్టర్ స్కేల్‌పై 5.4 గా నమోదైంది. రాత్రి చీకటికి సంబంధించిన కొన్ని చిత్రాలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రజలు పరుగులు తీస్తున్నారు. భవనాలు, సరిహద్దు గోడలు కూలడంతో రోడ్లపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 126 భవనాల ధ్వంసం, 21మందికి గాయాలు, పగిలిన గ్యాస్ పైప్‌లైన్,
China Earthquake
Surya Kala
|

Updated on: Aug 06, 2023 | 9:00 AM

Share

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ బలమైన ప్రకంపనల కారణంగా భారీ విధ్వంసం జరిగింది. భవనాలు స్ప్రింగ్ లాగా వణికాయి. భయంతో జనం పరుగులు తీశారు. పలువురు గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైంది. ఆదివారం ఉదయం ప్రజలు నిద్రిస్తున్న సమయంలో భూకంపం సంభవించింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంటే 2:33 సమయానికి భూమి కంపించింది.  భూకంప కేంద్రం డెజౌలో ఉంది. కేంద్రం లోతు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. 126 భవనాలు నేలమట్టమయ్యాయి. 21 మంది గాయపడినట్లు సమాచారం.

రాజధాని బీజింగ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. చైనా భూకంప నెట్‌వర్క్ కేంద్రాలు ప్రకంపనల తీవ్రత 5.5 అని చెబుతున్నాయి. అయితే అమెరికన్ జియోలాజికల్ సర్వే రిక్టర్ స్కేల్‌పై 5.4 గా నమోదైంది. భూకంపానికి సంబంధించిన కొన్ని చిత్రాలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రజలు పరుగులు తీస్తున్నారు. భవనాలు, సరిహద్దు గోడలు కూలడంతో రోడ్లపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. చీకట్లో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న వ్యక్తులు ఈ శిథిలాలకు  ఢీకొని కిందపడి గాయాలపాలయ్యారు. బాధితులకు సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దిగింది.

నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు, దెబ్బతిన్న గ్యాస్ పైప్‌లైన్లు

భూకంప తీవ్రతను చూసి రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌ను పరిశీలిస్తున్నారు. రహదారిపై కూడా తీవ్ర ప్రభావం పడింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉంది. ఈ కేంద్రం ఉపరితలం నుంచి అంత లోతుగా లేదని అమెరికన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. అటువంటి పరిస్థితిలో, మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. పైపులైన్‌ పరిశీలనకు బృందాలను నియమించారు. పలు ప్రాంతాల్లో పైపులైన్లు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..