Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Supply: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు హెరాయిన్.. అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు

గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌(Mundra Port) లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి, నలుగురు భారతీయులు, 11మంది ఆఫ్ఘన్ పౌరులపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు...

Drugs Supply: ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు హెరాయిన్.. అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు
Drugs
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 17, 2022 | 5:11 PM

గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌(Mundra Port) లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఆరు నెలల తర్వాత ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి, నలుగురు భారతీయులు, 11మంది ఆఫ్ఘన్ పౌరులపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది. కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి ముంద్రా పోర్ట్‌కు తరలించిన 2,988 కిలోల హెరాయిన్‌ (Heroin) ను కలిగి ఉన్న రెండు కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబరు 13, 2021న సరకును సీజ్ చేశారు. అహ్మదాబాద్‌లోని ఎన్‌ఐఏ (NIA) ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం.. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. దీని వెనకాల తాలిబన్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఆఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఆర్థిక చేయూతకు ప్రపంచ దేశాలేవీ ముందుకు రాని పరిస్థితులు నెలకొనడంతో తాలిబన్లు ‘డ్రగ్స్’ సరఫరాను ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నట్లు డైరెక్టోరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తున ఆఫ్గనిస్తాన్‌లో ఓపియం ఉత్పత్తి అవుతోంది. ఈ పంట నుంచే హెరాయిన్‌ తయారు చేస్తారు. దీన్ని పండించేవారి నుంచి, దీన్ని హెరాయిన్‌గా మార్చే ల్యాబోరేటరీల నుంచి, అలాగే ట్రేడర్స్‌ నుంచి తాలిబన్లు పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తారు. తాలిబన్ల మొత్తం ఆదాయంలో కేవలం డ్రగ్స్ సప్లై ద్వారానే 60శాతం ఆదాయం సమకూరుతోంది. ఇటీవల ఆఫ్గనిస్తాన్‌లో ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు… తాము డ్రగ్స్ జోలికి వెళ్లదలుచుకోలేదని ప్రకటించారు. కానీ మిగతా హామీల్లాగే ఇదీ వట్టిదేనని తేలిపోయింది.

ఆర్థిక సంక్షోభం దృష్ట్యా తాలిబన్లకు మాదకద్రవ్యాల సరఫరా ఆదాయ మార్గంగా మారింది. అప్ఘానిస్తాన్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు, అక్కడి నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు ఈ కంటైనర్లు చేరుకున్నాయి. ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో డ్రగ్స్ రవాణానే ఏకైక ఆదాయ మార్గంగా తాలిబన్లు భావిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్‌కు ఈ డ్రగ్స్ చేరుకున్నట్లు భావిస్తున్నారు. నిజానికి గత ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వంలో డ్రగ్స్‌పై నిషేధం విధించారు. కానీ తాలిబన్ల రాజ్యస్థాపన తర్వాత ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా వారి వద్ద నిధులు లేని దుస్థితి నెలకొంది.

Also Read

Holi 2022: రంగుల పండగలను..అందమైన, సులభమైన రంగోలి డిజైన్‌లతో అలంకరించుకోండి ఇలా.. సింపుల్ ఐడియాస్ మీకోసం

Kunool Jail: ఖిలాడీ ఖైదీ.. ఐదు రోజుల్లో రెండు సార్లు తప్పించుకున్నాడు.. అధికారులు ఏం చేశారంటే

Puneeth Rajkumar: కన్నడనాట పునీత్ రాజ్ కుమార్ మేనియా.. లైవ్ వీడియో