Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bernard Arnault: వారసుడి ఎంపిక కోసం నెలకోసారి పిల్లలతో బిలియనీర్ లంచ్ మీట్.. పదేళ్లుగా పరీక్ష పెడుతున్న ప్రపంచ కుబేరుడు

నెలకు ఒకసారి ఎల్‌విఎంహెచ్‌ ఆఫీసులో  ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో 90 నిమిషాల భోజనం కోసం కేటాయిస్తాడు. ఈ సమయంలో తన పిల్లలను కొన్ని విషయాలపై సలహాలు సూచనలు తన పిల్లలను అడుగుతారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇలా గత పదేళ్లుగా బెర్నాడ్ చేస్తున్నట్లు తెలిపింది. 

Bernard Arnault: వారసుడి ఎంపిక కోసం నెలకోసారి పిల్లలతో బిలియనీర్ లంచ్ మీట్.. పదేళ్లుగా పరీక్ష పెడుతున్న ప్రపంచ కుబేరుడు
Bernard Arnault
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2023 | 8:55 AM

తన సామ్రాజ్యాన్ని తన తర్వాత ప్రజారంజకంగా పాలించే వారసుడికి కోసం మహారాజులు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారన్న కథలు అనేకం విన్నాం.. అదే విధంగా ఒక ప్రపంచ కుబేరుడు తన వ్యాపారాన్ని చేపట్టి.. సక్సెస్ గా రన్ చేసే వారసుడిని ఎంపికలో బిజీబిజీగా ఉన్నాడట. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్నీ నడిపే వారసుడి ఎంపికలో ఎప్పటి నుంచో రంగం సిద్ధంచేస్తున్నారని..  దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచే కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది  ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి.

ఆయనే  74 ఏళ్ల వయస్సులో కూడా చురుకైన నిర్ణయాలతో వ్యాపారాన్ని అగ్రపథాన తీసుకుని వెళ్తున్న ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నాడ్‌ ఆర్నాల్ట్‌. ఆయనకు ఐదుగురు పిలల్లు. నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో తన వ్యాపారసామ్రాజ్యానికి ఒకరిని వారసుడిగా ఎంపిక చేయాలనీ బెర్నాడ్‌ ఆర్నాల్ట్‌ ఆలోచిస్తున్నారు. లూయి విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ పేరుతో ప్రపంచంలో లగ్జరీ బ్రాండ్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తన పిలల్లో ఎవరు తన తర్వాత అత్యంత సామర్ధ్యంగా వ్యాపార రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లారు అనే విషయంపై బెర్నాడ్ దశాబ్ద కాలం క్రితమే కసరత్తు ప్రారంభించారట. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే విషయంపై ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన విలాసవంతమైన సామ్రాజ్యం ఎల్‌విఎంహెచ్‌ని (LVMH) అప్పగించేందుకు తన ఐదుగురు పిల్లలను ఆడిషన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం నెలకు ఒకసారి ఎల్‌విఎంహెచ్‌ ఆఫీసులో  ప్రైవేట్ డైనింగ్ రూమ్‌లో 90 నిమిషాల భోజనం కోసం కేటాయిస్తాడు. ఈ సమయంలో తన పిల్లలను కొన్ని విషయాలపై సలహాలు సూచనలు తన పిల్లలను అడుగుతారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇలా గత పదేళ్లుగా బెర్నాడ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇలా లంచ్ సమయంలో మాట్లాడుకునే విషయాలతో కంపెనీ అనుసరించే వ్యూహాలు, నిర్ణయాలు, వ్యాపార సామ్రాజ్ఞ విస్తరణ విషయాలపై పిల్లలకు అవగాహన కలిగిస్తూనే.. తన వారసుడిని ఈజీ ఎంపిక చేయవచ్చు అని బెర్నాడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తన పిల్లలు తీసుకుని నిర్ణయాలను పరిశీలించి వారసుడి విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు అనేది బెర్నాడ్‌ అభిప్రాయమని పేర్కొంది. బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన వారసుడు మెరిట్‌పై ఎంపిక చేస్తాడని అయితే అతను ఎవరు అనేదాని ఎటువంటి సూచనను ఇవ్వలేదని పేర్కొన్నది.

ప్రస్తుతం బెర్నాడ్ పిల్లలందరూ లగ్జరీ కంపెనీలో ముఖ్యమైన పదవులను కలిగి ఉన్నారు. పెద్ద బిడ్డ, ఏకైక కుమార్తె డెల్‌ఫైన్‌కు క్రిస్టియన్ డియోర్‌లో రెండవ అతిపెద్ద బ్రాండ్‌ బాధ్యతలను అప్పగించారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. డెల్‌ఫైన్‌ సోదరుడు ఆంటోయిన్‌ ఎల్‌విఎమ్‌హెచ్ , కుటుంబ అదృష్టాన్ని పర్యవేక్షించే హోల్డింగ్ ఫర్మ్‌ను నివహిస్తున్నాడు. ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్ TAG హ్యూయర్ బ్రాండ్ CEO గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్ లగ్జరీ జ్యూయలరీ టిఫనీలో ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు, అయితే అందరిలో చిన్నవాడు చిన్నవయసులోనే జీన్ ఆర్నాల్ట్ లూయిస్ విట్టన్ వాచ్ విభాగానికి మార్కెటింగ్,  ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.

అయితే ఈ ఐదుగురు పిల్లల్లో ఎవరిని తన వారసుడిగా ఎంపిక చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్ బిలియనీర్ వారసుడి బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారో తెలియాలంటే బెర్నాడ్ స్వయంగా ప్రకటించాల్సిందే.. అంతవరకూ ఎదురుచూడాల్సిందే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..