Viral Video: దుబాయ్‌కి టేకాఫ్ అయిన విమానం.. అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు.. ఆ తర్వాత..
విమాన ప్రమాదాలు ఇటీవల పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే.. మరో ప్రమాదం కలకలం రేపింది.
విమాన ప్రమాదాలు ఇటీవల పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన ఘటన మరువక ముందే.. మరో ప్రమాదం కలకలం రేపింది. తాజాగా.. నేపాల్‌లో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం ఖాట్మాండు నుంచి దుబాయ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ 576 (బోయింగ్ 737-800 మోడల్) విమానంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారని.. అప్పటికే విమానాశ్రయంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం విమానం దుబాయ్‌కు టేకాఫ్ అయినట్లు తెలిపారు.
ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. ఖాట్మండు విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఫ్లై దుబాయ్ విమానంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఖాట్మండు-దుబాయ్ విమానం బయలుదేరినట్లు పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం 9:59కి ఈ ఘటన జరిగిందని, ఆ తర్వాత విమానం దుబాయ్‌కి బయలుదేరింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో చూడండి..
#Nepal #UAE : Video reportedly of Flydubai plane that caught fire upon⁰taking off from Kathmandu airport in Nepal & is trying to⁰make landing at airport pic.twitter.com/1eXsPHu8zP
— sebastian usher (@sebusher) April 24, 2023
అయితే, విమానంలో మంటలు చెలరేగిన తర్వాత.. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు బయటకు వచ్చి.. దానికి సంబంధించిన దృశ్యాలను మొబైల్ ఫొన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..