Bangladesh Crisis: అంధకారంలో బంగ్లాదేశ్‌.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనులు నిలిపివేత.. మండిపడుతున్న ప్రజలు

ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు విద్యుత్ వైఫల్యం ఏర్పడడంపై దేశ వ్యాప్తంగా  నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

Bangladesh Crisis: అంధకారంలో బంగ్లాదేశ్‌.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనులు నిలిపివేత.. మండిపడుతున్న ప్రజలు
Bangladesh Economic Crisis
Surya Kala

|

Oct 05, 2022 | 11:24 AM

బంగ్లాదేశ్‌లో మంగళవారం దేశవ్యాప్తంగా చీకటి నెలకొంది. నేషనల్ పవర్ గ్రిడ్ వైఫల్యం కారణంగా ఇది జరిగిందని అధికారులు పేర్కొన్నారు.  దేశంలోని తూర్పు ప్రాంతంలో ఎక్కడో ఒక చోట విద్యుత్ సరఫరా విఫలమైందని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. రాజధాని ఢాకాతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని అన్ని పవర్ ప్లాంట్లు మూతపడ్డాయని, విద్యుత్‌ను నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికార ప్రతినిధి షమీమ్ హసన్ తెలిపారు.

ఎక్కడ, ఎందుకు లోపం సంభవించిందో తెలుసుకోవడానికి ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారని, వ్యవస్థను పునరుద్ధరించడానికి గంటల సమయం పట్టవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు విద్యుత్ వైఫల్యం ఏర్పడడంపై దేశ వ్యాప్తంగా  నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

మూతపడిన డీజిల్‌తో నడిచే పవర్ ప్లాంట్లు   బంగ్లాదేశ్ ప్రభుత్వం డీజిల్‌తో నడిచే పవర్ ప్లాంట్‌లన్నింటినీ మూసివేసింది. డీజిల్‌తో నడిచే పవర్ ప్లాంట్లు బంగ్లాదేశ్ విద్యుత్ ఉత్పత్తిలో 6 శాతం ఉత్పత్తి చేస్తాయి. వాటిని మూసివేయడంతో  1500 MW వరకు ఉత్పత్తిని తగ్గింది. దీంతో ఇటీవల గార్మెంట్ రంగ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు ఫరూక్ హసంకా ఇటీవల చెప్పారు. ప్రస్తుతం వస్త్ర కర్మాగారాల్లో రోజుకు 4 నుంచి 10 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండడం లేదు.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారు బంగ్లాదేశ్ చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. వస్త్ర ఉత్పత్తుల ఎగుమతుల నుండి ప్రతి సంవత్సరం దాని మొత్తం విదేశీ మారకద్రవ్యంలో 80 శాతానికి పైగా సంపాదిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిరేటు గతంలో అంచనా వేసిన 7.1 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. తగ్గిన ఎగుమతులు.. దేశీయ తయారీలే.. ఆర్ధిక  మందగమనానికి కారణమని పేర్కొంది.

దేశంలో రోజు రోజుకీ దిగజారుతున్న పరిస్థితి బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారడానికి అతిపెద్ద కారణం దిగుమతులు పెరగడం.. ఎగుమతుల తగ్గుదల అని సెంట్రల్ బ్యాంక్  నివేదికలో ప్రస్తావించబడింది. నివేదిక ప్రకారం.. జూలై 2021 నుంచి మే 2022 మధ్య, $81.5 బిలియన్లు దిగుమతి అయ్యాయి. గతేడాదితో పోలిస్తే దిగుమతులు 39 శాతం పెరిగాయి. అదే సమయంలో, బంగ్లాదేశ్ ఇతర దేశాల నుండి వస్తువులను ఆర్డర్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. అదే సమయంలో తమ దేశం నుంచి వస్తువుల ఎగుమతిని తగ్గించింది. ఈ విధంగా దేశం ఆర్ధిక వ్యవస్థ ఇబ్బంది పండిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu