Expensive Sheep: ప్రపంచంలోనే ఖరీదైన గొర్రె రూ. 2 కోట్లకు అమ్మకం.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

ఆస్ట్రేలియాలో గొర్రెల మాంసం పరిశ్రమ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో.. గతంలో గొర్రె నుంచి ఉన్ని సేకరణ చేసేవారు. అయితే ఈ ప్రక్రియకు అధిక వ్యయం అవుతోంది.

Expensive Sheep: ప్రపంచంలోనే ఖరీదైన గొర్రె రూ. 2 కోట్లకు అమ్మకం.. దీని స్పెషాలిటీ  ఏమిటంటే..
Most Expensive Sheep
Follow us

|

Updated on: Oct 05, 2022 | 1:39 PM

ఆస్ట్రేలియాకు చెందిన ఎలైట్ జాతికి చెందిన గొర్రె రికార్డ్ ధరకు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. వేలం పాటలో ఈ గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ కి చెందిన వ్యక్తులు రూ.2 కోట్లకు దక్కించుకున్నారు. ఈ సిండికేట్‌లో న్యూ సౌత్ వేల్స్ నుండి నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ సిండికేట్ సభ్యుడు స్టీవ్ పెడ్రిక్ ఈ వూలీబ్యాక్‌ను “ఎలైట్ షీప్” అని పిలిచాడు. కోట్ల రూపాయలకు అమ్ముడవడంతో abc నివేదికల ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెల్లో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఈ ఎలైట్ గొర్రె జాతి గొర్రెకు జన్యపరంగా దీనికి వ్యాధినిరోధకత శక్తి అధికంగా ఉంటుందని..వేగంగా ఎదుగుతుందని చెబుతున్నారు. “ఈ గొర్రెలను గొర్రెల పెంపకం దారులు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గొర్రె యజమాని గ్రాహం గిల్మోర్ తన గొర్రె ఇంత భారీ మొత్తానికి అమ్ముడవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తనకు ఇప్పటికీ ఇది నమ్మలేని నిజం అంటూ తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో గొర్రెల మాంసం పరిశ్రమ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో.. గతంలో గొర్రె నుంచి ఉన్ని సేకరణ చేసేవారు. అయితే ఈ ప్రక్రియకు అధిక వ్యయం అవుతోంది. ఈ నేపద్యంలో మాంసం ధర క్రమంగా పెరుగుతుండగా.. గొర్రెల నుంచి ఉన్నిని కత్తిరించే వారి సంఖ్య తగ్గుతోంది. ఆస్ట్రేలియాలోని ఈ తెల్ల గొర్రెలు మాంసం కోసం పెంచబడుతున్నాయి. వీటి శరీరంపై బొచ్చు లేని కారణంగా మంచి డిమాండ్ ఏర్పడిందని గ్రాహం గిల్మోర్ చెప్పాడు. గతంలో ఇదే జాతికి చెందిన గొర్రె రూ.1.25 కోట్లకు అమ్ముడుపోగా.. ప్రస్తుతం ఆ రికార్డు బ్రేక్ చేస్తూ ఎలైట్ షీప్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles