AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Love: తొలిప్రేమ అంటే ఇదేనేమో.. పార్టీలో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న78 ఏళ్ల వ్యక్తి.. 18 ఏళ్ల అమ్మాయి..

18 ఏళ్ల హలీమా అబ్దుల్లా అనే యువతి  78ఏళ్ల రషద్ మంగాకోప్ అనే వృద్ధుడుని ఓ పార్టీలో చూసింది. తొలి చూపులోనే ప్రేమించింది. ఇద్దరి మధ్య 60ఏళ్ల తేడా ఉంది. అయినప్పటికీ ఆ బాలిక తన ప్రేమగురించి చెప్పి ఆ రషద్ ను ఒప్పించింది.

Unique Love: తొలిప్రేమ అంటే ఇదేనేమో.. పార్టీలో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న78 ఏళ్ల వ్యక్తి.. 18 ఏళ్ల అమ్మాయి..
Unique Love Marriage
Surya Kala
|

Updated on: Oct 05, 2022 | 1:38 PM

Share

ప్రేమ గుడ్డిది.. ప్రేమకు వయసుతో పనిలేదు.. ఆస్తులు అంతస్తులు చూసుకోదు .. ఇది కథల్లో, సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి.  తాజాగా అందుకు సంబంధించిన ఓ ప్రేమ పెళ్లి వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వధూ వరుల మధ్య ఏజ్ గ్యాప్ 60 ఏళ్ళు.. మనవరాలి వయసున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో వృద్ధుడు.. అది కూడా పెద్దల అంగీకారంతో నచ్చిన యువతి చేయి అందుకున్నాడు ఈ పెళ్ళికొడుకు.. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

18 ఏళ్ల హలీమా అబ్దుల్లా అనే యువతి  78ఏళ్ల రషద్ మంగాకోప్ అనే వృద్ధుడుని ఓ పార్టీలో చూసింది. తొలి చూపులోనే ప్రేమించింది. ఇద్దరి మధ్య 60ఏళ్ల తేడా ఉంది. అయినప్పటికీ ఆ బాలిక తన ప్రేమగురించి చెప్పి ఆ రషద్ ను ఒప్పించింది. దీంతో మూడేళ్లపాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పక్షుల్లా విహరించారు. మూడేళ్ళ ప్రేమాయణం తర్వాత తమ కుటుంబ సభ్యులకు తమ ప్రేమ గురించి చెప్పి.. వారి అంగీకారంతో బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

పెళ్లి గురించి రషద్ సోదరుడు కూతురు స్పందిస్తూ.. ఓ పార్టీలో మూడేళ్ళ క్రితం ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని.. తాను రషద్‌ను ఇష్టపడుతున్నట్లు హలీమా అబ్దుల్లా  చసెప్పింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్ళ తర్వాత.. ఆగస్ట్ 25న వివాహం చేసుకున్నారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అయితే రషద్ మంగాకోప్‌కు కూడా ఇదే మొదటి పెళ్లి.. ఇదే విషయాన్నీ రషద్ స్వయంగా తెలిపాడు. తన జీవితంలో మొదటి సారిగా ప్రేమించిన అమ్మాయి హలీమా అబ్దుల్లానే అని.. ఇప్పటి వరకూ తాను ఎవరినీ ప్రేమించలేదని చెప్పాడు.  ఫిలిప్పీన్స్‌  దేశంలో చట్టాల ప్రకారం.. 21 ఏళ్ళు లోపు యువతి .. యువకుడు తల్లిదండ్రులఒప్పుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ పెళ్లి నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అయినప్పటికీ, ఫిలిప్పీన్స్‌లో వయస్సు అంతరం వివాహం చాలా సాధారణం. పెళ్లి తర్వాత, ఈ జంట వీలైనంత త్వరగా తమ కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.  

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..