Garbha Dance: మెల్‌బోర్న్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. గర్భా లో సందడి చేసిన భారతీయులు

దసరా పండుగ సందర్భంగా సాయంత్రం కావడంతో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. చీకటి పడిన వెంటనే మైదానంలోని రంగురంగుల లైట్ల మధ్య ప్రజల ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం మహా ఆరతితో సంప్రదాయ గర్భ ప్రారంభమైంది.

Garbha Dance: మెల్‌బోర్న్‌లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. గర్భా లో సందడి చేసిన భారతీయులు
Garbha Dance
Follow us

|

Updated on: Oct 05, 2022 | 10:10 AM

నవరాత్రుల సందర్భంగా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గర్బా  సందడి కనిపిస్తోంది. సాంప్రదాయ పద్ధతిలో రంగురంగుల దుస్తులను ధరించి  అమ్మవారిని పూజిస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా గర్భ, దాండియా నైట్స్ వేడుకలు జరుపుకుంటున్నారు. అమ్మవారిని శ్రద్ధాసక్తులతో పూజిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఉజ్జయిని నివాసి అదితి రావల్ స్ఫూర్తితో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివసించే ప్రజలు అమ్మవారిని ఆరాధిస్తూ.. భక్తిలో మునిగితేలుతున్నారు. మెల్‌బోర్న్‌లోని విక్టోరియా నైబర్‌హుడ్ సిటీలో, డాక్‌లేన్ రిప్రజెంటేటివ్ గ్రూప్‌తో కలిసి అదితి నవరాత్రి గర్భా నైట్ ను నిర్వహించారు. భారీ సంఖ్యలో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.

సంప్రదాయ నృత్యం గర్భా ను చేస్తూ అమ్మవారిని పూజించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి విశేషాలను భావి తరాలకు అందించేందుకు ఈ గర్భా నృత్యాన్ని నిర్వహిస్తున్నట్లు అదితి చెప్పారు. మెల్‌బోర్న్ సిటీలో  ఈ పండగను నిర్వహించే ముందు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం నుండి ఈ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అందరూ ఈ వేడుక్కి హాజరయ్యేలా వాట్సాప్ గ్రూప్ సహాయం తీసుకుని కష్టపడి పనిచేశానని.. దాని ఫలితంగా ఈరోజు కనిపించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మొదట అమ్మవారికి పూజ.. అనంతరం గర్భా నృత్యం ఈ ఈవెంట్ కోసం ఒక మైదానం సిద్ధం చేయబడింది. అమ్మవారికి పూజలు చేసి దీపం వెలిగించిన అనంతరం గర్భాను ప్రారంభించారు.  భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి భారీ సంఖ్యలో గర్భా నృత్యం చేశారు.

రంగురంగుల దీపాల మధ్య ఉత్సాహంగా: దసరా పండుగ సందర్భంగా సాయంత్రం కావడంతో ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. చీకటి పడిన వెంటనే మైదానంలోని రంగురంగుల లైట్ల మధ్య ప్రజల ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం మహా ఆరతితో సంప్రదాయ గర్భ ప్రారంభమైంది. ఆ తర్వాత దాండియా నేపథ్యంలో రూపొందించిన పలు కీర్తనలు, పాటలు వినిపించారు. గర్బా ఉత్సవాన్ని అన్ని వయసుల వారు ఆస్వాదించారు. పిల్లల నుండి వృద్ధుల వరకు, వివిధ రకాల ప్రత్యేకమైన దుస్తులతో సందడి చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..