Indian Origin: అమెరికాలో పసిపాప సహా నలుగురు భారత సంతతి వ్యక్తులు కిడ్నాప్.. మారణాయుధాలతో..
అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ అయిన నలుగురిలో 8 నెలల పసిపాప కూడా ఉంది.

అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ అయిన నలుగురిలో 8 నెలల పసిపాప కూడా ఉంది. ఆయుధాలతో ఉన్న వ్యక్తులు సోమవారం వారిని కిడ్నాప్ చేశారు. యూఎస్ కాలిఫోర్నియాలోని అత్యంత రద్దీగా ఉండే మెర్సిడ్ కౌంటీలో ఈ కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో రహదారికి ఇరువైపుల పలు రిటెయిల్ దుకాణాలు, రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్లు మారణాయుధాలు కలిగి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు. భారత సంతతి వ్యక్తులు జస్‌దీప్ సింగ్ (36), అతని భార్య జస్లీన్ కౌర్ (27), వారి కుమార్తె అరూహీ ధేరి (8 నెలలు), వారి బంధువు అమన్‌దీప్ సింగ్ (39) కిడ్నాప్‌కు గురైనట్లు మెర్సిడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా.. కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తులో అన్ని విషయాలు బయటికి వస్తాయని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాపర్ ఎవరై ఉంటారు, కిడ్నాప్‌కు కారణం ఏమిటి అనే వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. నిందితులుగానీ, బాధితులుగానీ కనిపిస్తే వారి దగ్గరకు వెళ్లకూడదని.. వెంటనే 911కు ఫోన్ చేయాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని, ప్రమాదకరమైన వ్యక్తి అని పోలీసులు వివరించారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి అధికారులతో సంప్రదించి.. వారిని క్షేమంగా తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని కోరింది.




మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..