AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pink Diamond: వేలానికి సిద్ధమైన పింక్ డైమండ్.. దక్కించుకునేందుకు భారీ పోటీ.. రూ.172 కోట్లు పలుకుతుందని అంచనా..

చూడటానికి చిన్నదే. కానీ ఏకంగా రూ.172 కోట్లు పలుకుతుందట. హాంకాంగ్‌లో ఈ నెల 7న వేలానికి రానున్న పింక్‌ డైమండ్‌ ముచ్చటిది. చిన్న పక్షుల గుడ్డు సైజు కన్నా చిన్నగా ఉన్న ఈ డైమండ్‌ను చూడగానే కండ్లు జిగేల్‌మంటున్నాయి...

Pink Diamond: వేలానికి సిద్ధమైన పింక్ డైమండ్.. దక్కించుకునేందుకు భారీ పోటీ.. రూ.172 కోట్లు పలుకుతుందని అంచనా..
Pink Diamond
Ganesh Mudavath
|

Updated on: Oct 04, 2022 | 6:52 AM

Share

చూడటానికి చిన్నదే. కానీ ఏకంగా రూ.172 కోట్లు పలుకుతుందట. హాంకాంగ్‌లో ఈ నెల 7న వేలానికి రానున్న పింక్‌ డైమండ్‌ ముచ్చటిది. చిన్న పక్షుల గుడ్డు సైజు కన్నా చిన్నగా ఉన్న ఈ డైమండ్‌ను చూడగానే కండ్లు జిగేల్‌మంటున్నాయి. ఈ వజ్రాన్ని ఫ్యాన్సీ వివిడ్ పింక్ స్టార్ అని పిలవడంలోఆశ్చర్యం లేదు. దాని కాంతి అంతలా తళుక్కుమంటోంది.. డైమండ్స్‌లో పింక్‌ డైమండ్స్‌ వేరయా అంటోంది- హాంకాంగ్‌లోని సోత్బే అనే వేలంపాట సంస్థ. సహజంగా లభించే వజ్రాల్లో పింక్‌ డైమండ్స్‌ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇందులో అతి చిన్నగా ఉన్నవాటిని ‘ఫ్యాన్సీ వివిడ్ పింక్’గా వర్గీకరిస్తారు. వీటిని సానపెట్టి ఒక రూపం తెచ్చేందుకు చాలా నైపుణ్యం, శ్రమ అవసరం. గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ డైమండ్‌ను హాంకాంగ్‌లో ఈనెల ఏడో తేదీన వేలం వేస్తున్నారు. వేలం పాటలో దీనికి రూ.172 కోట్లు ధర పలకవచ్చని సోత్బే అంచనా వేస్తోంది. ఈ ఫ్యాన్సీ వివిడ్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌ 11.15 క్యారెట్లు ఉన్నట్లు చెబుతున్నారు.

టాంజానియాలో ఉన్న మ్వాదుయ్‌ ప్రాంతంలోని విలియంసన్ మైన్ గనుల్లో ఇది దొరికింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన వజ్రాల గని. గతంలో ఈ గనుల నుంచి వెలికి తీసిన అతి పెద్ద డైమండ్ 59.60 క్యారెట్లు ఉంది. ఈ వజ్రాన్ని 2017లో వేలం వేశారు. 10 క్యారెట్ల అతిచిన్న వజ్రం కూడా విలియంసన్ మైన్ గనుల్లోనే దొరికింది. ఈ ‘ఫ్యాన్సీ వివిడ్ పింక్’ను మొదటిసారిగా లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు. బాయ్, సింగపూర్, తైపీల మీదుగా హాంకాంగ్‌ తెచ్చారు. ఏడో తేదీన జరిగే వేలంలో ఆసియాకు చెందిన బిడ్డర్లు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారని సోత్బే వర్గాలు తెలిపాయి.

కాగా.. ఆఫ్రికాలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ వజ్రం దొరికింది. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తామని తెలిపింది. ఈ వజ్రానికి ‘లులో రోజ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే.. 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రంగా రూపొందనుంది. లులో రోజ్ సుమారు 90 క్యారెట్ల వరకు ఉండనుందనే అంచనాతో ‘పింక్ స్టార్’ కన్నా భారీగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us