AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?

సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో..

Airport Heist: రూ.260కోట్ల కోసం ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన దొంగల ముఠా.. కాల్పుల్లో ఇద్దరు మృతి.. చివరికి ఏమైందంటే..?
Aircraft Heist
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 09, 2023 | 6:52 PM

Share

విమానంలో తరలిస్తున్న భారీ మొత్తాన్ని దోచుకునేందుకు ఓ దొంగల ముఠా పడరాని పాట్లు చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమవడంతో దుండగులను అడ్డుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. చిలీ రాజధాని శాంటియాగోలో ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడాలోని మియామీ నుంచి 32.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.262 కోట్లు) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సిన ఆ నగదుకు సంబంధించిన వివరాలు తిలిసిన ఓ దొంగల ముఠా.. శాంటియాగోలోని ఆర్తురో మెరినో బెనిటెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా దాడి చేసింది. వాహనాలతో సహా విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.

ఆ క్రమంలో కొందరు దొంగలు అయితే ఏకంగా భద్రతా సిబ్బందిపైనే దాడి చేసి వారి ఆయుధాలను లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో విమానాశ్రయంలోని ఓ సెక్యూరిటీ ఉద్యోగి మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. ఇక మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేమీ కాదు. 2020లో అయితే ఓ దొంగల ముఠా ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్‌ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..