AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: టీమిండియా దిగ్గజాల సరసన చేరిన కింగ్ కోహ్లీ.. ఆ ఘనత సాధించిన 13వ ప్లేయర్‌గా రికార్డు..

భారత జట్టు తరఫున తమ గడ్డపై 50 టెస్టు మ్యాచ్‌లు ఆడడం అంటే అది ముమ్మాటికీ పెద్ద విషయమే. అలాగే ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు మాత్రమే..

Virat Kohli: టీమిండియా దిగ్గజాల సరసన చేరిన కింగ్ కోహ్లీ.. ఆ ఘనత సాధించిన 13వ ప్లేయర్‌గా రికార్డు..
Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 09, 2023 | 5:17 PM

Share

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు/చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి భారత గడ్డపై 50వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలో 50వ టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఘనతను సాధించిన 13వ ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు. భారత జట్టు తరఫున తమ గడ్డపై 50 టెస్టు మ్యాచ్‌లు ఆడడం అంటే అది ముమ్మాటికీ పెద్ద విషయమే. అలాగే ఇప్పటి వరకు 12 మంది భారత ఆటగాళ్లు మాత్రమే అలాంటి ఘనత సాధించారు. అందులో టీమిండియా బ్యాట్స్‌మ్యాన్ విరాట్ కోహ్లీ కూడా తాజాగా చేరాడు. భారత్‌లో 94 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఈ లిస్టులో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత భారత్‌లో 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ పేరు ఉంది. ప్రస్తుత భారత జట్టులో ఆటగాళ్లు అయిన చతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

భారత గడ్డపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆటగాళ్లు:

  1. సచిన్ టెండూల్కర్ – 94
  2. రాహుల్ ద్రవిడ్ – 70
  3. సునీల్ గవాస్కర్ – 65
  4. కపిల్ దేవ్ – 65
  5. అనిల్ కుంబ్లే – 63
  6. వీవీఎస్ లక్ష్మణ్ – 57
  7. రవిచంద్రన్ అశ్విన్ – 55*
  8. హర్భజన్ సింగ్ – 55
  9. దిలీప్ వెంగ్‌సర్కార్ – 54
  10. వీరేంద్ర సెహ్వాగ్ – 52
  11. చెతేశ్వర్ పుజారా – 51
  12. సౌరవ్ గంగూలీ – 50
  13. విరాట్ కోహ్లీ – 50*

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు