IND vs AUS 4th Test: సెంచరీతో కదం తొక్కిన ఖవాజా.. తొలి రోజే టీమిండియాపై ‘కంగారు’

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి..

IND vs AUS 4th Test: సెంచరీతో కదం తొక్కిన ఖవాజా.. తొలి రోజే టీమిండియాపై ‘కంగారు’
Ind Vs Aus, 4th Test Day 1 Score
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 09, 2023 | 6:22 PM

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖవాజా(251 బంతుల్లో 104 నాటౌట్; 15 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కగా.. ట్రావిస్ హెడ్ (32), స్టివెన్ స్మీత్(38), పీటర్ హండ్స్‌కుబ్(17) పరుగులు చేసి ఔటయ్యారు. హండ్స్‌కుబ్ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(49 నాటౌట్; 8 ఫోర్లు) ఖవాజాతో కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూనే వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో ఆసీస్ తొలి రోజు టీమిండియాపై పై చేయి సాధించింది. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు.ః

అయితే ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినా లేదా మ్యాచ్ డ్రాగా ముగిసినా.. శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ఫలితంపై భారత్ ఆధారపడి ఉండవలసి ఉంటుంది. లంకేయులకు, కీివీస్ జట్టుకు మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ఈ రోజే ప్రారంభం అయింది. ఈ సిరీస్‌ను శ్రీలంక 2-0 తేడాతో న్యూజిలాండ్‌పై గెలిస్తే లంకేయులు ఫైనల్ మ్యాచ్ ఆడతారు. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. మరోవైపు ఇండోర్ వేదికగా భారత్, ఆసీస్ మధ్య జరిగిన 3వ టెస్టులో విజయం సాధించిన కంగారుల జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..