Coca Cola Death: ఛాలెంజ్ చేసి లీటరున్నర కూల్ డ్రింక్ తాగాడు.. ఆ తర్వాత కడుపు ఉబ్బి ఏమైదంటే..

ఎలాంటి శుభాకార్యాలు జరిగినా.. పార్టీ జరిగినా అక్కడ తప్పకుండా కూల్‎డ్రింక్స్ ఉండాల్సిందే.. ఏడాది పసి పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు కూల్ డ్రింక్ అంటే దాదాపు ఇష్టమే ఉంటుంది. మంచి నీళ్లు తాగినా..

Coca Cola Death: ఛాలెంజ్ చేసి లీటరున్నర కూల్ డ్రింక్ తాగాడు.. ఆ తర్వాత కడుపు ఉబ్బి ఏమైదంటే..
Coco
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 27, 2021 | 1:11 PM

ఎలాంటి శుభాకార్యాలు జరిగినా.. పార్టీ జరిగినా అక్కడ తప్పకుండా కూల్‎డ్రింక్స్ ఉండాల్సిందే.. ఏడాది పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు కూల్ డ్రింక్ అంటే దాదాపు ఇష్టమే ఉంటుంది. మంచి నీళ్లు తాగినా.. తాగకపోయినా కూల్ డ్రింక్ మాత్రం పీపాల కొద్దీ తాగేస్తున్నారు. మరి ఇవి శరీరానికి మంచివేనా అంటే.. ఆలోచించాల్సిదే.. ఇవి తాగితే ఆరోగ్యానికి దెబ్బే.. ఇప్పటికే పలు పరిశోధనలు కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు తేల్చి చెప్పాయి. అయితే, వాటి మోతాదు తక్కువే. కానీ, అతిగా కూల్ డ్రింక్స్ తాగేవారికి మాత్రం అది స్లో పాయిజన్ కిందే లెక్క. అంటే.. నెమ్మదిగా అవయవాలను దెబ్బ తీసి చంపేస్తుందన్నమాట. మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అక్కడే వస్తున్నాం ఆగండి.. ఓ 22 ఏళ్ల యువకుడు కూల్ డ్రింక్ తాగిన ఆరు గంటల్లోనే మరణించాడు.

కూల్ డ్రింక్ ఎంత ఇష్టమైనా.. తాగడానికి మాత్రం ఒక పద్ధతి ఉంటుంది. ఆత్రుతగా తాగేస్తే ఎంత ప్రమాదమో ఈ వ్యక్తి ఎదురైన అనుభవమే నిదర్శనం. చైనాకు చెందిన ఓ వ్యక్తి 1.5 లీటర్ల కోకా-కోలా డ్రింక్‎ను 10 నిమిషాల్లోనే తాగేశాడు. ఛాలెంజ్ చేసి బాటిల్ దించకుండా తాగి తన స్నేహితుల ముందు హీరో అవుదామని అనుకున్నాడు. కానీ పాడె ఎక్కుతానని అనుకోలేదు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత బాగానే ఉన్నాడు. కానీ, ఆరు గంటల తర్వాత అతడి శరీరం అదుపు తప్పింది. అతడి కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయింది. తీవ్రమైన నొప్పితో అతడు బీజింగ్‌లోని చోయాంగ్ ఆస్పత్రికి పరుగులు పెట్టాడు. వైద్యులు సీటీ స్కాన్ చేసి.. కడుపు నిండా గ్యాస్ నిండిపోయినట్లు గుర్తించారు. అతడికి ‘న్యుమాటోసిస్’ ఏర్పడిందని వైద్యులు తెలిపారు. పేగు, కాలేయానికి చెందిన సిరలో గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని ‘క్లీనిక్స్ అండ్ రీసెర్చ్ ఇన్ హేపటాలజీ అండ్ గ్యాస్ట్రోయెంటరాలజీ’ పేర్కొంది.

ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ నిలిచిపోతుంది. దీన్నే ‘షాక్ లివర్’ అని కూడా పిలుస్తారు. కాలేయం, ఇతర అవయవాల్లోకి గ్యాస్ చేరడం వల్ల అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వైద్యులు.. అతడి శరీరంలోని గ్యాస్‌ను వెలికి తీసేందుకు ప్రయత్నించారు. కాలేయం దెబ్బతినకుండా కొన్ని మందులు కూడా ఇచ్చారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. వైద్యులు సుమారు 18 గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది.

Read also. Hindu Heritage Month: అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అక్టోబర్‌ను హిందూ మాసంగా గుర్తింపు.. వేడుకలకు రెడీ అవుతున్న హిందువులు

Weight Loss Tips: డైటింగ్ లేకుండానే ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు తెలుసా..? అయితే ఈ ఐదు చిట్కాలను పాటించండి..