Terrorist Attack: యూదుల ప్రార్థనా మందిరంలో ఉగ్రదాడి, ఇద్దరు మృతి.. అనుమానితుడిని జిహాద్ అల్-షమీగా గుర్తింపు
బ్రిటన్‌లో ఉగ్రదాడి జరిగింది. యూదుల క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున యూదుల ప్రార్థనా స్థలంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడి చేసిన వ్యక్తిని సిరియా మూలానికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పెను ప్రమాదంగా.. యూదు సమాజంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు . భద్రతను పెంచుతామని హామీ ఇచ్చారు.

యూదుల క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగోగ్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. యోమ్ కిప్పూర్ పవిత్ర దినోత్సవం నాడు జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. 35 ఏళ్ల జిహాద్ అల్-షమీగా పోలీసులు గుర్తించారు.
గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు మొదట దీనిని ఒక పెద్ద ప్రమాదంగా అభివర్ణించారు. అయితే కౌంటర్-టెర్రరిజం కమాండ్ తరువాత దీనిని ఉగ్రవాద సంఘటనగా ప్రకటించింది. భద్రతా సిబ్బందితో సహా అనేక మంది కత్తులతో చేసిన దాడిలో గాయపడ్డారు.. మరికొందరు వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. పోలీసులు ఆపరేషన్ ప్లేటోను అమలు చేసి బాంబు స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించారు. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ విషయం తెలిసి మొదట తాను తాను షాక్‌కు గురయ్యానని.. ఈ దుర్ఘటనకు బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు యూదు సమాజాన్ని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాల వద్ద అదనపు భద్రతా దళాలను మోహరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఎటువంటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు ప్రజలను కోరారు.
కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా సంతాపం తెలిపారు
బకింగ్‌హామ్ ప్యాలెస్ కింగ్ చార్లెస్ III .. క్వీన్ కెమిల్లా తరపున సంతాపం తెలిపారు. ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. స్థానిక మేయర్ ఆండీ బర్న్‌హామ్ ఈ దాడిని అసహ్యకరమైనదిగా అభివర్ణించారు. బాధితులకు.. వారి కుటుంబాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఈ ఘటన జరగడం తీవ్ర విచారకరమని పేర్కొంది.
దాడి చేసిన వ్యక్తి సిరియాలో జన్మించిన బ్రిటిష్ పౌరుడు.
ఉగ్రవాద దాడిని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితుడిని గుర్తించారు. పౌరులపై దాడి చేసిన వ్యక్తి సిరియాలో జన్మించిన 35 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు జిహాద్ అల్-షామిగా గుర్తించారు. అతను సంఘటనా స్థలంలోనే కాల్చి చంపబడ్డాడు. అతను తన కారుతో ప్రజలపైకి దూసుకెళ్లిన తర్వాత.. కత్తిని పట్టుకుని ప్రజలపై దాడి చేశాడు. అయితే అనుమానిత పేలుడు చొక్కా ధరించి ఉన్నాడు. దీని కారణంగా అతడిని మట్టుబెట్టడం ఆలస్యం అయింది. అయితే ఆ చొక్కాలో బాంబు లేదని తరువాత నిర్ధారించబడింది.
మరో ముగ్గురు అనుమానితులు అరెస్ట్
ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ దీనిని యూదు సమాజంపై ప్రత్యక్ష దాడి అని చెప్పారు. దాడి తర్వాత దేశంలో అత్యవసర హెచ్చరికని జారీ చేశారు. ఉగ్రవాద కుట్ర ఆరోపణలపై మరో ముగ్గురు అనుమానితులను (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) అరెస్టు చేశారు. ప్రజలకు భద్రతను పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పందిస్తూ.. సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి తమతో చేతులు కలపాలని సంఘీభావం కోసం విజ్ఞప్తి చేశారు. దాడి తర్వా UKలో అత్యవసర హెచ్చరిక ‘ప్లేటో’ జారీ చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలలో భద్రతను పెంచారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




