AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో గొడవ.. ఎమ్మెల్యే జోక్యం.. ఏం జరిగిందంటే

విమానంలో గొడవ.. ఎమ్మెల్యే జోక్యం.. ఏం జరిగిందంటే

Phani CH
|

Updated on: Oct 03, 2025 | 3:45 PM

Share

విమానం గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే, ప్రయాణికుడు గొడవపడిన ఘటన కలకలం రేపింది. ఇటీవలి విమానాల్లో తరచూ చోటుచేసుకుంటున్న వివాదాలు తలనొప్పిగా మారాయి. కొంతమంది అవివేక చర్యలతో విమానాల్లో ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు. ఢిల్లీ నుంచి లక్నో కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం అప్పుడే టేకాఫ్‌ అయింది.

సమద్‌ అనే ఓ ప్రయాణికుడు ఫోన్‌లో ఓ మహిళను దూషిస్తూ తిట్ల దండకం అందుకున్నాడు. ఫోన్‌లో గట్టిగా అరుస్తూ బూతులతో ఎవరో మహిళను తిడుతున్నాడు. అతడి వెనుకే ఉన్న ఓ ప్రయాణికురాలు అభ్యంతరం తెలిపింది. చిన్నగా మాట్లాడాలని రిక్వెస్ట్ చేసింది. దాంతో సదరు ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అదే విమానంలో యూపీలోని అమేథీకి చెందిన గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్‌సింగ్ కూడా ప్రయాణిస్తున్నారు. ఇది గమనించిన ఎమ్మెల్యే అతడిని మందలించారు. చిన్నగా మాట్లాడాలని సూచించారు. ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఊరుకోలేదు. ఎమ్మెల్యే రాకేష్‌ను సమద్ అసభ్య పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యేను నెట్టేసాడు. ఈ గొడవ చూసిన ప్రయాణికులు షాకయ్యారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో కలగజేసుకున్న సిబ్బంది.. వారి మధ్య వివాదాన్ని ఆపారు. ఎయిరిండియా విమానం లఖ్‌నవూలో ల్యాండ్‌ అయిన తర్వాత సమద్ పై ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్‌సింగ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు ఫతేపుర్‌ జిల్లాకు చెందిన సమద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పౌరులకు వాక్‌ స్వేచ్ఛ ఉంది కదా.. అని ఎవరు పడితే వారు.. అవతలి వారి గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఈ ఘటన తర్వాత ఎయిర్‌పోర్టు బయటికి వచ్చిన ఎమ్మెల్యే రాకేష్ చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌

దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!

సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

Published on: Oct 03, 2025 03:45 PM