రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్
న్యూయార్క్ లగార్డియా విమానాశ్రయంలో రెండు విమానాలు గమ్యస్థానాలకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. ప్రయాణికులతో ఉన్న రెండు విమానాలు రన్‌వేపై నెమ్మదిగా కదులుతున్నాయి. అప్పుడే ఊహించని ప్రమాదం జరిగింది. అతి సమీపంగా వచ్చిన ఈ రెండు విమానాలు రన్‌వే పైనే ఢీకొట్టుకునేంత పని చేశాయి.
అతి సమీపంగా రావడం వల్ల ఒక విమానం రెక్క మరొక విమానం ముక్కును ఢీకొనడంతో అక్కడే ఉన్న సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. వెంట్రుకవాసిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లగార్డియా విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు కమర్షియల్ డెల్టా విమానాలు రన్‌వేపై ఒకేసారి వచ్చి ప్రమాదవశాత్తూ ఒకదాన్నొకటి తాకాయి. పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు.ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. రన్‌వే టాక్సీయింగ్ సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక విమానం రెక్క విరిగిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ విమానం మరో విమానం ముక్కు భాగాన్ని ఢీకొంది. ఈ విమానాలు తక్కువ వేగంతో కదులుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లాగార్డియా విమానాశ్రయం.. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత న్యూయార్క్ నగరంలో రెండో అత్యంత రద్దీ ఉండే ఎయిర్ పోర్ట్. లాగార్డియా విమానాశ్రయంలో మార్చిలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం రెక్క రన్‌వేను తాకడంతో ప్రమాదం జరిగింది. దాంతో విమానాశ్రయం భద్రతలో లోపం బయటపడింది. ఈ అంశంపై ఫెడరల్ ఏవియేషన్ దర్యాప్తు జరిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!
సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు
Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..
దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే
రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

