AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరు కర్రలపై మాత్రమే నడుస్తారు.. ! ఎందుకంటే..

వీరు కర్రలపై మాత్రమే నడుస్తారు.. ! ఎందుకంటే..

Phani CH
|

Updated on: Oct 03, 2025 | 4:30 PM

Share

ఆఫ్రికా తెగలలో చిత్ర విచిత్ర ఆచారాలు, సంప్రదాయాలను చూస్తాం. నేటికీ పాత సంప్రదాయాలనే పాటిస్తూ జీవించే వ్యక్తులు ఉన్నారు. వారి జీవన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దూరంగా ఏదో శబ్దం.. టక్‌ టక్‌ టక్‌.. టక్‌ టక్‌ టక్‌.. అని వినిపిస్తుంది. అక్కడ ఉన్న టూరిస్టులకు అది కర్రల శబ్దమని అర్థమవుతోంది. కానీ ఆ కర్రలను ఎవరు తీసుకువస్తున్నారో, ఎందుకు తెస్తున్నారో అర్థం కాదు.

ఇంతలో కొంతమంది వచ్చారు. అందరూ రెండేసి పెద్ద కర్రలపై నడుస్తూ వచ్చారు. అట్లే తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకు వారు అలానే కర్రలపై నడుస్తారు. నేలపై మాత్రం దిగడం లేదు. వీరే ఆఫ్రికా ఇథియోపియా దేశంలోని బన్న తెగవారు. ఇథియోపియాలోని ఒమో లోయలో వీరుంటారు. వ్యవసాయం, పశువుల పెంపకం చేస్తుంటారు. వీరి జనాభా 50 వేల వరకు ఉంటుంది. వ్యవసాయం ఇతర పనులు చేసే సమయాల్లో కర్రలు వాడరు. వీరి హెయిర్‌ స్టయిల్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. బన్నా తెగలో కర్రలపై నడవడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. అప్పట్లో పాములు, క్రూరమృగాల నుంచి కాపాడుకునేందుకు ఇలా కర్రలను ఉపయోగించి నడిచేవారు. ఇప్పటికీ అటవీప్రాంతంలో వారి ఇళ్లు ఉండటంతో అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కర్రలు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లయినా వీటిపై నడవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. బొరానా తెగలో ఓ వింత ఆచారం ఉంది. పెళ్లికి ముందు వరకే ఆడపిల్లలకు జుట్టు పెంచుకునే అవకాశం కల్పిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇక అమ్మాయిలు వారి జుట్టును కత్తిరించుకోవాల్సిందే. ఇదేం విడ్డూరం అంటే.. మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు. ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి వరుడు దొరుకుతాడని.. ఏకంగా గుండు చేయించుకుంటే.. వారికి మంచి భర్త, అత్తింటి వారు లభిస్తారని బొరానా ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో దర్శనమిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే

రూ.50 కోట్ల బీమా కోసం ఎంతకు తెగించాడంటే.. భార్య, తల్లిదండ్రుల హత్య

సంక్రాంతి ఫైట్‌.. ఫైనల్‌ లిస్ట్‌లో ఆ నలుగురు

డివైడర్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు సజీవ దహనం