Nigeria: నైజీరియాలో ఆగని మారణహోమం..160 మంది మృతి, 300 మందికి పైగా తీవ్ర గాయాలు
మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పుల్లో మొత్తం 160 మంది మృతి చెందారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘బండిట్స్’గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో..
నైజీరియా, డిసెంబర్ 26: మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పుల్లో మొత్తం 160 మంది మృతి చెందారు. స్థానికులు బందిపోట్లుగా పిలిచే ముఠాలు ఆదివారం వివిధ వర్గాలపై దాడి చేసినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘బండిట్స్’గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మృతి చెందినట్లు తెలిసింది. అయితే, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
బండిట్స్ దాడి సమయంలో సెంట్రల్ నైజీరియాలోని ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, జాతి పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొన్ని సాయుధ మూకలు గ్రామాలపై తరచూ దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటాయని తెలిపారు. స్థానికుల్ని అపహరించి సొమ్మును డిమాండ్ చేస్తుంటారు. 2009 నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజా దాడిలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఊచకోత కొనసాగింది.
ముష్కరులు కనీసం 20 వేర్వేరు కమ్యూనిటీలపై దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించినటలు తెలుస్తోంది. 300 మందికి పైగా గాయపడిన వారిని బోకోస్, జోస్, బార్కిన్ లాడిలోని ఆసుపత్రులకు తరలించారు. స్థానిక రెడ్‌క్రాస్ నుంచి తాత్కాలిక టోల్ బొక్కోస్ ప్రాంతంలోని 18 గ్రామాలలో 104 మరణాలను నివేదించింది. బార్కిన్ లాడి ప్రాంతంలోని అనేక గ్రామాలలో కనీసం 50 మంది మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. దాడులను ఖండిస్తున్నామని, భద్రతా బలగాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు డిక్సన్ చోలోమ్ కోరారు. బొక్కోస్ ప్రాంతంలో ప్రారంభమైన దాడులు పొరుగున ఉన్న బార్కిన్‌కు వ్యాపించాయని, అక్కడ 30 మంది చనిపోయారని స్థానిక ఛైర్మన్ దంజుమా డాకిల్ తెలిపారు. ఈ ఊత కోతను అనాగరికమైనదిగా, క్రూరమైనదిగా రాష్ట్ర గవర్నర్ కాలేబ్ ముట్ఫ్వాంగ్ అభివర్ణించారు. ప్రజలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని గవర్నర్ అధికార ప్రతినిధి గ్యాంగ్ బెరే తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.