Chocolate Factory: ఆ చాక్లెట్ తీపి వెనుక ఉన్నది ఆటిజం వ్యక్తులే.! యూకేలో ఆటిజం వ్యక్తులు.
ఆటిజం ఉన్న వ్యక్తుల తీరే విభిన్నం. స్పెషల్ నీడ్స్ ఉన్న వీరికి ఉద్యోగాలు ఇచ్చి జీవితంపై ఆశ కల్పించే ఉద్దేశ్యంతో ఏకంగా ఓ చాక్లెట్ ఫ్యాక్టరీనే స్థాపించారు పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట. ఆటిజంతో బాధపడుతున్న తమ కుమారుడికి జాబ్ ఇవ్వాలన్న సంకల్పంతో పాకిస్తాన్‌కు చెందిన దంపతులు ప్రారంభించిన చాక్లెట్ ఫ్యాక్టరీ మరో మూడు వేల మందికి ఆసరా అందించింది. ఆ మూడు వేల మంది ఆటిజం బాధితులే కావడం విశేషం.
ఆటిజం ఉన్న వ్యక్తుల తీరే విభిన్నం. స్పెషల్ నీడ్స్ ఉన్న వీరికి ఉద్యోగాలు ఇచ్చి జీవితంపై ఆశ కల్పించే ఉద్దేశ్యంతో ఏకంగా ఓ చాక్లెట్ ఫ్యాక్టరీనే స్థాపించారు పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట. ఆటిజంతో బాధపడుతున్న తమ కుమారుడికి జాబ్ ఇవ్వాలన్న సంకల్పంతో పాకిస్తాన్‌కు చెందిన దంపతులు ప్రారంభించిన చాక్లెట్ ఫ్యాక్టరీ మరో మూడు వేల మందికి ఆసరా అందించింది. ఆ మూడు వేల మంది ఆటిజం బాధితులే కావడం విశేషం. 17 ఏళ్ల క్రితం మోనా షా, షాజ్ షా దంపతులు తమ కుమారుడు ఏష్ షా భవిష్యత్తు కోసం పాకిస్తాన్ వదిలి కెనడా వెళ్లాలనుకున్నారు. అయితే ఏష్ ఆటిజం బాలుడు కావడంతో వీరి వీసా తిరస్కరణకు గురైంది. అదే సమయంలో యుకేకు వీసా మంజూరు కావడంతో వీరు వలస వచ్చి లండన్లో స్థిరపడ్డారు. చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభించి తొలుత తమ కుమారుడికి జాబ్ కల్పించారు.
ఆ తర్వాత అంచెలంచెలుగా మరో మూడు వేల మంది ఆటిజం బాధితులను చేర్చుకున్నారు. దీని ద్వారా ఓ చరిత్రను సృష్టించారు.యుకెలో 7 లక్షల మంది ఆటిజం బాధితులుండగా వారిలో ఐదు మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం లభిస్తున్నట్లు అక్కడి సర్వేలు చెప్తున్నాయి. అయితే ఫ్యాక్టరీ మొత్తంలో పూర్తిగా ఆటిజం వ్యక్తులనే నియమించడం ఇదే తొలిసారి కావడంతో చాక్లెట్ కంపెనీ హ్యారీ స్పెక్టర్స్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ దృష్టిని ఆకర్షించింది. దాంతో ప్రిన్స్ ఇటీవల ఫ్యాక్టరీని సందర్శించి ఆటిజం బాధితులకు కొన్ని వేల పని గంటల అనుభవం కల్పించినందుకు షా దంపతులను ప్రశంసించారు. సహనంతో మెలగాలనీ గౌరవించి బాధ్యతలు అప్పగిస్తే అద్భుతాలు సాధిస్తారనీ యజమానులు మోనా షా, షాజ్ షా దంపతులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.