China New Weapon: చైనా కొత్త ఆయుధం.. శత్రువు మెదడును కంట్రోల్ చేసి యుద్ధంలో గెలిచే కుతంత్రం
చైనా బ్రెయిన్ వార్‌ఫేర్ విభాగాన్ని సిద్ధం చేసింది. ఇది చైనా ప్రత్యేక వ్యూహంలో భాగం. ఖరీదైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకుండానే యుద్ధంలో విజయం సాధించేందుకు చైనా సైన్యం ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైందని నివేదికలో పేర్కొంది. ఇది అత్యంత ప్రమాదమైన ఆయుధం అంటూ ఇదే విషయంపై అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.
చైనా విస్తరణ కాంక్ష తో పొరుగు దేశాలతో పాటు.. ప్రపంచంలో తన ఆధిపత్యం ఉండాలనే ధోరణి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటికే తన దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలతో ఇరుగుపొరుగు దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటుంది. ఇక రెండేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ గురించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఆయుధాన్ని చైనా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి శత్రువులను చంపడానికి చైనా మనసునే టార్గెట్ గా చేసుకుని సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అవును చైనా బ్రెయిన్ వార్‌ఫేర్ విభాగాన్ని సిద్ధం చేసింది. ఇది చైనా ప్రత్యేక వ్యూహంలో భాగం. మనస్సుని నియంత్రించబడే ఆయుధాన్ని చైనా సృష్టించిందని మీడియా నివేదికలలో పేర్కొంది. దీనిని శత్రువులపై దాడి చేసినప్పుడు ఉపయోగించనుంది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోవీపన్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉందని రీసెర్చ్ గ్రూప్ CCP బయోత్రీట్స్ ఇనిషియేటివ్ తెలిపింది. ఈ మూడు ఆయుధాల కలయిక శత్రువులకు ప్రాణాంతకం అవుతుంది. ఖరీదైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకుండానే యుద్ధంలో విజయం సాధించేందుకు చైనా సైన్యం ఇలాంటి ఆయుధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైందని నివేదికలో పేర్కొంది. ఇది అత్యంత ప్రమాదమైన ఆయుధం అంటూ ఇదే విషయంపై అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.
చైనా ఆయుధాలు శత్రువును అధీనంలోకి తెచ్చుకుంటుందంటే ..
తమకు ఎదురయ్యే శత్రువుల మెదడుని కంట్రోల్ లోకి తీసుకుని నిద్రలోకి వెళ్లే విధంగా ఆయుధాలను చైనా సిద్ధం చేస్తోందని పరిశోధనా బృందం నివేదిక పేర్కొంది. అంతేకాదు శత్రువు దృష్టిని యుద్ధం నుండి మల్లించేవిధంగా విద్యుదయస్కాంత శక్తిని వినియోగించే ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయుధాల నుండి వెలువడే మృదువైన రేడియో తరంగాల కారణంగా శత్రువు ఆవులించడం ప్రారంభిస్తాడు. అయితే ఈ సమయంలో ఈ రేడియో తరంగాలు తమ సైనికులపై ప్రభావం చూపకుండా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు.. ప్రత్యేక ఫేస్ కవరింగ్ గాజులను సిద్ధం చేసిందని నివేదికలో పేర్కొంది. చైనా సైనికులు వీటిని ధరించాలి. ఈ అద్దాలు ధరించిన తర్వాత సైనికులు భద్రంగా ఉంటారు. ఎటువంటి ప్రభావానికి లోను కారని పేర్కొంది.
ఇప్పుడు యుద్ధ భూమిలో తమ శత్రు దేశ సైనికుడి ప్రవర్తనను నియంత్రించేందుకు మానవ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి.. నియంత్రించేందుకు చైనా సిద్ధమైందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా హెచ్చరికను కూడా పట్టించుకోని చైనా
చైనా సృష్టిస్తున్న కొత్త ఆయుధాలు శత్రువుల మనసులపై ప్రభావం చూపిస్తూ గజిబిజిగా చేసేందుకు ప్రయత్నిస్తాయి. చైనా సైన్యం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ , బయోలాజికల్ వెపన్స్‌పై దృష్టి సారించిందని నివేదిక పేర్కొంది. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధరంగంలో శత్రువును ఓడించేందుకు చైనా సిద్ధమవుతోంది.
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలపై విజయం సాధించే విధంగా సరికొత్త ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రెండేళ్ల క్రితం బీజింగ్ లోని తమ పౌరులను నియంత్రించడానికి మానసిక ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు యుఎస్ వాణిజ్య మంత్రి గినా రైమోండ్ ప్రకటన చేశారు. ఇదే విషయంపై అమెరికా హెచ్చరించినా చైనా ఆగకుండా మానసిక ఆయుధాలను అభివృద్ధి చేసే ప్రయాణాన్ని కొనసాగించింది. సరిగ్గా రెండేళ్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇదే విషయంపై మీడియా వేదికగా నివేదిక వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..