Budget 2024: తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
బడ్జెట్.. బడ్జెట్ 2024 - 2025 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎలా ఉండబోతుంది.. అనేది ముందుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముందుగా ఏ వస్తువుల యొక్క ధరలు పెరిగాయి.. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గాయో ఇక్కడ తెలుసుకుందాం. దానికంటే ముందుగా.. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి. అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి.
బడ్జెట్.. బడ్జెట్ 2024 – 2025 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎలా ఉండబోతుంది.. అనేది ముందుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముందుగా ఏ వస్తువుల యొక్క ధరలు పెరిగాయి.. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గాయో ఇక్కడ తెలుసుకుందాం. దానికంటే ముందుగా.. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి. అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి.
తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చౌకమైనవి మరియు ఖరీదైన వస్తువుల పూర్తి జాబితా చూద్దాం:
చౌకగా మారిన వస్తువులు:
➤మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
➤బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి, ప్లాటినంపై 6.4%కి తగ్గింపు
➤ క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
➤ ఫెర్రో నికిల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➤ చౌకగా లభించనున్న లెదర్ వస్తువులు, సీఫుడ్
➤ సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదన
➤ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గింపు
➤ 25 కీలక ఖనిజాలపై కూడా కస్టమ్స్ సుంకం మినహాయింపు
➤ రొయ్యల, చేపల మేతపై, బ్రూడ్ స్టాక్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గింపు
ఖరీదైన వస్తువులు:
➤ టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10% నుండి 15%కి పెంపు
➤ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ 25 శాతం పెంపు
➤ అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం పెంపు
➤ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌పై 25 శాతం కస్టమ్స్ సుంకం పెంపు
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.