Budget 2024: ఈ బడ్జెట్ లో.. మహిళలకు ‘బంగారం’ లాంటి శుభవార్త.!

నిర్మలమ్మ బడ్జెట్ లో ఏముంది? మొత్తం బడ్జెట్ గురించి సామాన్యుడికి అవసరం లేదు. నిర్మలమ్మ పద్దులో తనకు వచ్చిన లాభమేంటి? తనపై పడే భారమేంటి? అనే లెక్కేసుకుంటాడు. అలా చూస్తే.. మోదీ 3.oలో వచ్చిన ఈ తొలి బడ్జెట్ లో కొన్ని రంగాలకు నెంబర్స్ భారీగా కనిపించాయి. ముఖ్యంగా ఏపీకి ఈసారి లాభం చేకూర్చేటట్లు కేటాయింపులు జరిపారనే చెప్పాలి. అటు మహిళలకు మాత్రం పెద్దపీట వేశారు. వారికి బంగారంలాంటి శుభవార్త చెప్పారు.

Budget 2024: ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

|

Updated on: Jul 26, 2024 | 4:31 PM

నిర్మలమ్మ బడ్జెట్ లో ఏముంది? మొత్తం బడ్జెట్ గురించి సామాన్యుడికి అవసరం లేదు. నిర్మలమ్మ పద్దులో తనకు వచ్చిన లాభమేంటి? తనపై పడే భారమేంటి? అనే లెక్కేసుకుంటాడు. అలా చూస్తే.. మోదీ 3.oలో వచ్చిన ఈ తొలి బడ్జెట్ లో కొన్ని రంగాలకు నెంబర్స్ భారీగా కనిపించాయి. ముఖ్యంగా ఏపీకి ఈసారి లాభం చేకూర్చేటట్లు కేటాయింపులు జరిపారనే చెప్పాలి. అటు మహిళలకు మాత్రం పెద్దపీట వేశారు. వారికి బంగారంలాంటి శుభవార్త చెప్పారు. నిజంగానే బంగారంతోపాటు మరికొన్ని లోహాలపై ట్యాక్స్ తగ్గించారు. వెండి, బంగారు కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి తగ్గించడంతో వాటి రేట్లు భారీగా తగ్గనున్నాయి. ఆ ఎఫెక్ట్ కూడా అప్పుడే స్పష్టంగా కనిపించింది.

ఆభరణాలపై 10 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రా అండ్ డెవలప్ మెంట్ సెస్ 5 శాతం ఉంటుంది. మొత్తంగా గోల్డ్ పై 15 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి ఆరు శాతానికి తగ్గించడంతో గోల్డ్ పై చెల్లించాల్సింది 11 శాతం పన్ను మాత్రమే. దీనివల్ల వచ్చే పెద్ద లాభం ఏమిటంటే.. ముడి బంగారాన్ని తక్కువకే కొనవచ్చు. మన దగ్గర దానికి మరికొంత వేల్యూ వర్క్ యాడ్ చేసి.. ఆభరణాలుగా మలిచి.. ఇక్కడా విక్రయించవచ్చు. ఎగుమతీ చేయవచ్చు. దీనివల్ల మహిళలకు తక్కువ ధరకే బంగారు, వెండి నగలు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ లో కూడా ఆ ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు నాలుగు వేల రూపాయిల మేర తగ్గింది. కేజీ వెండి ధర చూసుకున్నా సుమారు నాలుగు వేల రూపాయిల మేర తగ్గింది. సో.. ఆభరణాల వర్తకులు, డైమెండ్ బిజినెస్ చేసే వారి డిమాండ్ ఇప్పుడు నెరవేరినట్టే.

ఇక మహిళలకు మరో శుభవార్త ఏమిటంటే.. మహిళల పేరుపై ఆస్తులు కొంటే ట్యాక్స్ తగ్గించే యోచనలో కేంద్రం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పింది ఇదే. మహిళలు ఏవైనా ఆస్తులు కొంటే వాటిపై సుంకాలను ఎక్కువగా తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల మహిళలకు ఆస్తుల కొనుగోలులో ఆర్థిక భారం తగ్గుతుంది. అర్బన్ డెవలప్ మెంట్ స్కీమ్స్ లో భాగంగా దీనిని అమలు చేస్తారు. బడ్జెట్ లో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఉంది. అదేంటంటే.. చిన్నారుల భవిష్యత్తు కోసం.. వారి తల్లిదండ్రులు.. పొదుపు చేసేలా కేంద్రం కొత్త అవకాశాన్ని ఇచ్చింది. న్యూ పెన్షన్ స్కీమ్ లో దీనికోసం కొన్ని ఛేంజెస్ చేసింది. NPS వాత్సల్య పేరుతో ఈ పథకాన్ని తెస్తుంది. ఈ పెన్షన్ స్కీమ్ లో చిన్నారులను.. అంటే మైనర్లను కూడా చేరుస్తారు. ఈ స్కీమ్ వల్ల పిల్లల తల్లిదండ్రులు లేదా వారికి గార్డియన్ గా ఉండేవారు.. ఆ పిల్లల పేరుతోనే ఇన్వెస్ట్ మెంట్ చేయవచ్చు. వాళ్లకు మైనార్టీ తీరి.. మేజర్ అయ్యాక.. ఆ అకౌంట్ మామూలు ఎన్పీఎస్ అకౌంట్ లా ఆటోమేటిగ్గా ఛేంజ్ అయిపోతుంది. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ప్లాన్ పూర్తయ్యాక.. పిల్లలు పెద్దవారు అయిన తరువాత.. కొంత ఇన్ కమ్ వారికి లభిస్తుంది. గతంలో చిన్నారుల కోసం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఎలా హిట్టయ్యిందో.. ఇది కూడా ఆదరణ పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us