AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అక్కో అనకొండతో ఏందా పరాచకాలు.. కొంపదీసి పెంచుకుంటున్నావా ఏంటి…?

చిన్న పామును చూస్తేనే గజగజ వణికిపోతాం. అదే భారీ పాము అయితే గుండెలు గుభేల్ అంటాయి. అటువంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంత పెద్ద పాము కాళ్లు చుట్టుకున్నా.. ఆ అమ్మాయి ముఖంలో భయం లేదు.. ఈమె మనిషా..? లేదా స్నేక్ గర్లా..? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వైరల్ వీడియో మీరూ చూడండి..

Viral Video: అక్కో అనకొండతో ఏందా పరాచకాలు.. కొంపదీసి పెంచుకుంటున్నావా ఏంటి...?
Woman Carries A Giant Python On Her Shoulder
Krishna S
|

Updated on: Oct 17, 2025 | 6:24 PM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రమే వీక్షకులను నోరెళ్లబెట్టేలా చేస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచంలో ప్రమాదానికి భయపడని, ఎంత పెద్ద రిస్క్‌నైనా చాలా సులభంగా తీసుకోగల ధైర్యవంతులు ఉన్నారని ఈ వీడియో నిరూపిస్తుంది. ఒక మహిళ తన భుజంపై ఒక భారీ కొండచిలువతో పోజులిచ్చిన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.

భయమే లేని మహిళ..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక మహిళ తన భుజంపై అత్యంత భారీ కొండచిలువను మోయడం చూడవచ్చు. ఈ కొండచిలువ పరిమాణం చూసి ఎవరైనా భయపడక మానరు. సాధారణంగా చిన్న పాములను చూసినా పరుగులు తీసే మనుషులు ఉంటారు. అలాంటిది ఆ స్త్రీ తన శరీరంపై ఇంత పెద్ద, ప్రమాదకరమైన జీవిని ఎటువంటి భయం లేకుండా మోయడం ఆశ్చర్యకరం. వీడియోలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొండచిలువ నెమ్మదిగా కదులుతూ ఆ స్త్రీ కాళ్ళలో ఒకదానిని చుట్టుకుంటుంది. అయినప్పటికీ ఆమె ముఖంలో భయం ఏమాత్రం కనిపించదు. చాలా ప్రశాంతంగా, ధీమాగా ఆమె పోజులివ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

“అమ్మాయి కాదు.. స్నేక్ గర్ల్”

ఈ డేంజరస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @thereptilezoo అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే లక్షలాది మందిని ఆకర్షించింది. వేల లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది యూజర్లు ఆ మహిళను స్నేక్ గర్ల్ అని పిలవగా.. మరికొందరు “ఆమె మనిషా కాదా..? ఆమెకు అస్సలు భయం లేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు మాత్రం ఇలాంటి పెద్ద జంతువులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్