Viral Video: వామ్మో..ఈ అక్క తెలివికి దండం పెట్టాల్సిందే..! టేబుల్ ఫ్యాన్‌తో జుట్టు ఆరబెట్టింది.. ఆ తరువాత జరిగింది చూస్తే..
సాధారణంగా అమ్మాయిలు తమ జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించటం మీరు చూసి ఉంటారు. కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో కనిపించే అమ్మాయి తన జుట్టును ఆరబెట్టడానికి ఏమి చేసిందో చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..ధైర్యం ఉంటేనే చూడండి మరీ..!

ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాము. చాలా వీడియోలు ప్రజల్ని ఎంతగానో అలరిస్తాయి. వాటిల్లో వీడియోలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని వీడియోలు మనల్ని షాక్ అయ్యేలా చేస్తాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేకమైన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సాధారణంగా అమ్మాయిలు తమ జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగించటం మీరు చూసి ఉంటారు. కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో కనిపించే అమ్మాయి తన జుట్టును ఆరబెట్టడానికి ఏమి చేసిందో చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..ధైర్యం ఉంటేనే చూడండి మరీ..!
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి తన జుట్టును వాష్ చేసిన తర్వాత ఆరబెట్టడానికి ప్రయత్నిస్తుంది..కానీ, ఆ అమ్మాయి వద్ద హెయిర్ డ్రైయర్ లేదు. దాంతో ఆమె తన జుట్టును ఆరబెట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని కనిపెట్టింది. జుట్టును ఆరబెట్టేందుకు ఆమె ఏకంగా టేబుల్ ఫ్యాన్‌ను రివర్స్ చేసి తన జుట్టును ఆరబెట్టడం ప్రారంభించింది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఆమె చేసిన పని చూసిన జనాలు.. వామ్మో ఇంత డేంజర్ స్టంట్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఆ అమ్మాయి ఫ్యాన్‌ని పట్టుకుని వెనక్కి రివర్స్ చేసి ఆన్ చేసింది. టేబుల్ ఫ్యాన్ ని హెయిర్ డ్రైయర్ లాగా కదిలిస్తూ తన జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీయబడిందో ప్రస్తుతానికి తెలియదు. కానీ, ఈ హాస్యాస్పదమైన వీడియోను @kangrekom అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత ప్రజలు ఆ అమ్మాయి ట్రిక్ వెరీ డేంజర్ అంటూ కామెంట్స్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
when you don’t have a hair dryer pic.twitter.com/W9SyS9X1xs
— Kang rekom (@kangrekom) October 3, 2025
కాగా, ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా వీక్షించారు (Life Hack Video). 22 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. హెయిర్ డ్రయర్ అల్ట్రా ప్రో మాక్స్ అంటూ కామెంట్ చేయగా, అక్కా.. నీకు దండం అంటూ చాలా మంది పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




