ఓటర్లకు చేరకముందే చెరువులో వందలకొద్దీ ఓటరు కార్డులు..! బాధ్యులు ఎవరు..?
ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించి ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది. వందల కొద్దీ ఓటరు కార్డులు చెరువులో ఎలా పడ్డాయో ఈసీ స్పష్టం చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కాంగ్రెస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని పలువురు కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా బిజావర్‌లో చెరువులో వందలాది ఓటరు కార్డులు లభ్యమవడం కలకలం రేపింది..బిజావర్ పట్టణంలోని రాజా తలాబ్‌లో శనివారం వందలాది ఓరిజినల్ ఓటరు గుర్తింపు కార్డులు తేలుతూ కనిపించాయి. 15వ వార్డుకు చెందిన ఈ కార్డులన్నీ చెత్త తొలగింపు పనుల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చెరువులో వందలకొద్దీ ఓటరు కార్డులు గుర్తించారు. ఒక బ్యాగులో దాదాపు 400-500 ఓటరు కార్డులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్డులు ఓటర్లకు చేరకముందే మాయమయ్యాయని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించి ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది. వందల కొద్దీ ఓటరు కార్డులు చెరువులో ఎలా పడ్డాయో ఈసీ స్పష్టం చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కాంగ్రెస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని పలువురు కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ యాదవ్ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, “500-600 ఓటరు ఐడీలు చెరువుకు ఎలా చేరుకున్నాయి? నకిలీ ఓట్లు సృష్టించబడి ఇప్పుడు నాశనం చేయబడ్డాయా? ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి” అంటూ డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




